వికారాబాద్, నవంబర్ 1 : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట సమీపంలో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో విద్యార్థులను భయాందోళనకు గురిచేసేలా రాడ్‌తో చితకబాదిన పీఈటీ అన్వర్‌ఖాన్‌ను ఆర్ఎల్వో శ్రీనివాస్‌రెడ్డి సస్పెండ్ చేశారు. శనివారం మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల రీజినల్ లెవల్ కో-ఆర్డినేటర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి వికారాబాద్ మైనార్టీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయ న జరిగిన విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల గదులు, డార్మెటరీ, కిచెన్ షెడ్లను పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని వార్డెన్‌ను ఆదేశించారు. విద్యార్థులను చితకబాదిన పీఈటీ అన్వర్‌ఖాన్‌ను సస్పెండ్ చేశామన్నామన్నారు.