కాంగ్రెస్‌వి బూటకపుహమీలు
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇస్తున్నవి బూటకపు హామీలని పరిగి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. కేవలం ఎన్నికలలో ఓట్లు దండుకోవాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి మోసం చేయాలని చూస్తున్నదన్నారు.
- చెప్పింది చేసే నాయకుడు సీఎం కేసీఆర్
- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
- ఆఖరి రోజు ముమ్మర ప్రచారం
పరిగి, నవంబర్ 28 : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇస్తున్నవి బూటకపు హామీలని పరిగి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. కేవలం ఎన్నికలలో ఓట్లు దండుకోవాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి మోసం చేయాలని చూస్తున్నదన్నారు. మంగళవారం పరిగి మండలంలోని బర్కత్‌పల్లి, నస్కల్, రుక్కుంపల్లి గ్రామాలతోపాటు పరిగి పట్టణంలో రోడ్‌షో నిర్వహించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 55 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు ప్రజా సంక్షేమంపై ఆలోచిం చలేదని, తమ సంక్షేమానికే కాంగ్రెస్ నాయకులు పనిచేశారన్నారు.
తెలంగాణ సాధించిన నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు అందేలా పాలన సాగించారన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసా యా న్ని పండుగ చేయాలనే తలంపుతో రైతుబంధు ద్వారా ఎకరాకు సంవత్సరానికి రూ. 10వేలు పెట్టుబడి సహాయం అందిస్తున్నారని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి నోటి కాడి బుక్కను కాంగ్రెస్ లాగేసిందన్నారు. మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధును రూ.16వేలకు పెంచనున్నట్లు చెప్పారు. పేదలందరికీ రూ.400లకే వంట గ్యాస్ సిలిండర్ అందించడం ద్వారా పేదలపై భారం పడకుండా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టనున్నారని అన్నారు.

పరిగి అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే జరిగింద న్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని పరిగి పట్టణానికి రెండు విడతల్లో రూ.40కోట్లు మంజూరు చేశారని, రూ.15కోట్ల విలువ చేసే పనులు పూర్తి కావచ్చాయని, మిగతా పనులకు టెండర్లు పిలిచారని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు తనకు మరో అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. పరిగిలో పాలిటెక్నిక్ కళాశాల, కులక చర్లలో ఐటీఐ, జూనియర్ కళాశాలల ఏర్పాటు, దాదాపూర్, కంకల్ మండలాల ఏర్పాటు, గండీడ్, మహ్మదాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో కలపడానికి సంబంధించి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, వాటన్నింటినీ చేయించే బాధ్యత తాను తీసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి ప్రతిమారెడ్డి, జడ్పీటీసీ హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాం సుందర్‌రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్, మండల బీఆర్ ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్‌అలీ, సర్పంచ్‌లు ఆర్.శ్రీనివాస్, రాంచంద్రయ్య, ఎంపీటీసీ సంపూర్ణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

