బొంరాస్పేట, జనవరి 6: మైనార్టీ వర్గాల్లోని పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం వారికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలను అందించాలని నిర్ణయించింది. జీవనోపాధుల కోసం ఎకనామిక్ సపోర్ట్ పథకం కింద బ్యాంకుల ద్వారా రాయితీ రుణాలను మంజూరు చేస్తున్నది. ఏడేండ్ల తరువాత రాయితీ రుణాల పంపిణీ కోసం మైనార్టీ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. స్వయం ఉపాధి, వ్యా పార యూనిట్లకోసం బ్యాంకు లింకేజీ, నాన్లింకేజీ రుణాల మంజూరుకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రుణాల కోసం ప్రకటన ఇవ్వగా.. మళ్లీ ఈ ఏడాది వికారాబాద్ జిల్లాకు 146 యూనిట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రెండు కేటగిరీల్లో యూనిట్లు
జిల్లాలో మైనార్టీల జనాభా ఆధారంగా యూనిట్లను అధికారులు కేటాయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో మైనార్టీల జనాభా 1,32,714 ఉంది. దీని ఆధారంగా కేటగిరీ-1 లో 101 యూని ట్లు, కేటగిరీ-2లో 45 యూనిట్లను ప్రభుత్వం మం జూరు చేసింది. కేటగిరీలో-1లో రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. దీనిలో 80శాతం రాయితీ ఉం టుంది. కేటగిరీ-2లో రూ.2లక్షల వరకు రుణాన్ని ఇవ్వనుండగా 70శాతం వరకు సబ్సిడీ ఉంటుంది. కేటగిరీ-1లో 36 రకాల జీవనోపాధి యూనిట్లు ఉం డగా, కేటగిరీ-2లో 14 యూనిట్లున్నాయి.
అర్హతలు
దరఖాస్తుదారులు మైనార్టీ కమ్యూనిటీకి(ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైనులు) చెందిన వారై ఉండాలి. లబ్ధిదారుల వయస్సు 21 నుంచి 55 ఏం డ్ల మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఆధార్, తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉండాలి. tsob-mms.cgg. gov. in లేదా tsmfc.in అనే వెబ్సైట్ ద్వారా లబ్ధిదారులు ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను జిల్లాస్థాయి అధికారులు పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించి రుణాలు మంజూరు చేస్తారు. రుణాల మంజూరులో 33.5 శాతం మహిళలకు ప్రాధాన్యమిస్తారు. కుటుంబంలో ఒకరికే రుణాన్ని మంజూరు చేస్తారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒకసారి రుణం పొందితే మళ్లీ ఐదేండ్ల వరకు తిరిగి పొందే అవకాశం ఉండదు.
ఈ నెల 9 వరకు దరఖాస్తు చేసుకోవాలి
రంగారెడ్డి, జనవరి 6(నమస్తే తెలంగాణ): జిల్లాలోని మైనార్టీలకు కేటగిరీ 1, 2 క్రింద సబ్సిడీ రుణాలను 2022-23 ఆర్థిక సంవత్సరంలో అం దించేందుకు తెలంగాణ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నదని జిల్లా మైనార్టీస్ సంక్షేమశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోని మైనార్టీ (ముస్లింలు, సిక్కులు, పార్సిలు, బౌద్ధులు, జైనులు) కమ్యూనిటీల ఆర్థిక అభివృద్ధి, వ్యాపార యూనిట్ల ఏర్పాటు కోసం అర్హులు ఈ నెల 9 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారు మైనార్టీ కమ్యూనిటీకి చెందిన వారై ఉండాలి. ఆధార్, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదాలందరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. http:// tsobmms. cgg.gov.in లేదా tsmfc వెబ్సైట్: tsmfc.in చేసుకోవాలన్నారు.