అన్నదాతకు ఆనందం
రంగారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తయ్యింది. వానకాలానికి సంబంధించి జిల్లాలో 1,25,456 ఎకరాల్లో వరి పంట సాగుకాగా, పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది.
- 37 కేంద్రాల వడ్లను సేకరించిన అధికారులు
- 3,944 మంది రైతుల నుంచి 20,393 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు..
- రైతుల ఖాతాల్లో రూ.40,74,18,320 జమ
రంగారెడ్డి, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తయ్యింది. వానకాలానికి సంబంధించి జిల్లాలో 1,25,456 ఎకరాల్లో వరి పంట సాగుకాగా, పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలో మొత్తం 37 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించారు. 3,944 మంది రైతుల నుంచి 20,393 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి 100 శాతం చెల్లింపులను కూడా పూర్తి చేశారు. రూ.40,74,18320 లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
రంగారెడ్డి జిల్లాలో వానకాలానికి సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలో అన్ని రకాల పంటలు 3,42,996 ఎకరాల్లో సాగు కాగా.. అందులో వరి పంట 1,25,456 ఎకరాల్లో సాగైంది. ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా దిగుబడి వచ్చింది. 3,944 మం ది రైతులు తమ ఉత్పత్తులను అధికారులు ఏర్పా టు చేసిన 37 కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరను పొందారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ గత నవంబర్ నెలలో ప్రారంభం కాగా జనవరి చివరి లోపు అధికారులు పూర్తి చేశా రు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 100 శాతం డబ్బులను కూడా ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
1,25, 456 ఎకరాల్లో వరి సాగు..
జిల్లాలోని రైతులు వానకాలానికి సంబంధిం చి 1,25,456 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. రైతులు తమ అవసరాలకు సరిపడా ఉంచుకుని మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పా టు చేసిన సింగిల్ విండో, మెప్మా, వ్యవసాయ మార్కెట్ యార్డులు, మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో విక్రయించారు. ధాన్యం గ్రేడ్-ఏ క్వింటాల్‌కు రూ. 2,060, సాధారణ రకానికి రూ.2,040 చొప్పున మద్దతు ధరను ప్రభుత్వం చెల్లించింది. కొనుగో లు సక్రమంగా, పారదర్శకంగా జరిగేలా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు, మూడు రోజుల్లో డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దళారుల బెడ ద లేకుండా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యా న్ని విక్రయించి.. మద్దతు ధరను పొంది సంతోషాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో 3,944 మంది రైతుల నుంచి 20,393.960 మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని సేకరించిన అధికారులు రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.40,74,18,320 జమ చేశారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 2021-22 యాసంగి/రబీ సీజన్లలో పండిన ధాన్యాన్ని ప్రభు త్వం 42 కొనుగోలు కేంద్రాల ద్వారా 22,360. 25 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

