తాండూరు, ఫిబ్రవరి 18: మరమ్మతు పనుల్లో అధికారుల అలసత్వానికి నిద ర్శనంగా తాండూరు మండలం కరణ్‌కోట్- గౌతాపూర్ ఆర్అండ్బీ రహదారి ని పేర్కొనవచ్చు. రెండేళ్లుగా ఈ రోడ్డును మరమ్మతులు చేస్తుండగా ఒక వైపు పనులు చేపడుతుండగానే మరో వైపు కుంగిపోయి పెద్ద పెద్ద గోతులు పడుతు న్నాయి. ఆర్అండ్బీ అధికారులు సరైన ప్రణాళికలు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ప్రభుత్వ నిధులు రూ. 2 కోట్ల వరకు వ్యర్థంగా మారాయి. రెండేళ్ల క్రితం కరణ్‌కోట్- గౌతాపూర్ 10 కిలో మీటర్ల రోడ్డును రూ. నాలుగు కోట్ల అంచనా వ్యయంతో మరమ్మతు చేపట్టాలని పనులు ప్రారంభించారు. వాస్తవంగా పాడైన రోడ్డును పూర్తి స్థాయిలో బాగు చేసేందుకు అంచనాలు వేయవలసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇటు మరమ్మతులు చేస్తుండగానే ఒక వైపు రోడ్డు గుంతలు పడి పాడవుతుండగా మరో వైపు ప్రభుత్వ నిధులు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారు తున్నాయి.
రోడ్డు వాస్తవ తీరును బట్టి రోడ్డు మరమ్మతులకు అంచనాలు వేయడంలో అధికారులు విఫలం కావడమే ఇందుకు కారణంగా పలువురు నిపు ణులు చెబుతున్నారు. దాదాపు రూ. 2 కోట్ల నిధులు వ్యయం చేసి రోడ్డు మర మ్మతు పనులు చేపట్టిన తరువాత ఆర్అండ్బీ అధికారులకు కనువిప్పు కలి గింది. ఒక వైపు రోడ్డు మరమ్మతులు చేస్తుండగానే మరో వైపు రోడ్డు పాడవు తుండడంతో కళ్లు తెరిచిన అధికారులు రోడ్డును పూర్తి స్థాయిలో బాగు చేసేం దుకు కొత్తగా అంచనాలు రూపొందించారు. ప్రారంభంలో రూ. 2 కోట్ల నిధులు ఖర్చు చేసిన అధికారులు ఆరు నెలల క్రితం రూ. 4 కోట్లతో మరమ్మతులు చేయాలని సంకల్పించారు. ఇందుకుగాను అంచనాలు వేసి తిరిగి మరమ్మతు పనులు చేపట్టారు. అయినా సరే రోడ్డు తిరిగి పాడవుతుండడంతో తాజాగా మరోసారి కొత్త అంచనాలతో రూ. 2 కోట్లు అదనంగా నిధులకు ప్రతిపాదిం చారు. దీంతో రోడ్డు అంచనా వ్యయం తిరిగి రూ. 6 కోట్లకు చేరింది.
రెండేళ్ల క్రితం సబ్ బేస్ గ్రావెల్ పనులు చేపట్టకుండానే రూ. 2 కోట్ల వ్యయంతో గోపన్‌పల్లి- కరణ్కోట్ల మద్య 30 ఎంఎం డాంబరు( తారు) తో పనులు చేపట్టారు. అయితే అడుగు భాగంలో బేస్‌లో మట్టి వేయకుండా కేవలం 30 ఎంఎం ఎత్తుతో డాంబరు చిప్స్ కలిపి వేయడంతో ఎలా బాగు చేసిన రోడ్డు అలా తిరిగి మరమ్మతులకు గురైంది. దీంతో పస్ట్ పార్టు లో మంజూరు చేసిన రూ. 2 కోట్ల నిధులు వ్యర్థమైపోయాయి. దీంతో తిరిగి తాజాగా కొత్త అంచ నాలతో అదనంగా రూ. నాలుగు కోట్ల నిధు లు 0 నుంచి 10 కరణ్‌కోట్ వరకు మట్టి పోసి సబ్ బేస్ గ్రాంటు కింద ఈ నిధులు మంజూరైనాయి. మట్టికి ఎక్కువ నిధులు వెచ్చించి రివైజ్డ్ ఎస్టిమేట్ వేశారు. డాంబరు కేవలం 30 ఎంఎం. దొడ్డు కంకర మాల్ 50 ఎంఎం కాకుండా దొడ్డు మాల్ 60 ఎంఎం మందంతో, పన్నది 40 ఎంఎం మందం తో మళ్లీ మరమ్మతు పనులు చేయాలని సంకల్పించారు. దీంతో ఈ రోడ్డు అంచనా వ్యయం ఏకంగా రూ. 2 కోట్ల నుండి రూ. 6 కోట్లకు చేరుకుంది.
మట్టి వేసి రోలింగ్ చేయడం మరిచారు !
కొత్తగా రూపొందించిన అంచనాల ప్రకారం బెల్కటూర్ నుండి గోపన్‌పల్లి వరకు మట్టి వర్క్ చేసి బీటీ 60 ఎంఎం బీటీ కంకర, 2 ఫీట్లు మట్టి, మొత్తం ఒక మీటరు ఎత్తుతో రోడ్డు నిర్మాణం చేపట్టవలసి ఉంది. అయితే ఈ పనులు చేపట్టేందుకు కేవలం మట్టి వేసిరోలింగ్ పనులు మాత్రం కాంట్రాక్టరు చేప ట్టడంలేదు. వాస్తంగా క్యూరింగ్ చేస్తూ మట్టిని రోలింగ్ చేయాలి. అయితే కాంట్రాక్టరు ఇవేవి లేకుండా మట్టి వేసి వాహనాలు పోనిచ్చి డాంబరు వేసేందుకు పూనుకుంటున్నారు. దీంతో తిరిగి ఈ రోడ్డు పూర్తి స్థాయిలో బాగుపడేది అనుమానమే అని ప్రయాణికులు వాపోతున్నారు. కాగా గతంలో గుంతలు పడిన ప్రదేశాల్లోనే మట్టి కొట్టుకు పోయిన రోడ్డు మాత్రమే బాగు చేయాలని కాంట్రాక్టరు నిర్ణయించారు. రెండు కిలో మీటర్లు మట్టి పోసి రోలింగ్ చేయకుండా వదిలి వేయడంతో రోడ్డు నాణ్యతపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భారీ సంఖ్యలో ప్రయాణిస్తున్న వాహనాలు..
తాండూరు నుండి కరణ్‌కోట్ వరకు ఉన్న ఆర్అండ్బి ప్రధాన రహదారి నిత్యం వందలకొలది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. తాం డూరు మండలంలోని సీసీఐ, పెన్నా, కోరమాండల్, కర్ణాటకా రాష్ట్ర సరిహద్దులో ఉన్న వికాట్ సాగర్, చెట్టినాడ్ సిమెంట్ కార్మాగారాలకు నిత్యం వందల కొలది వాహనాలు సిమెంట్ లోడ్ కోసం, సిమెంట్ తయారికి ఉపయోంగించే రా మెటీరిల్( ఎర్రమట్టి, ల్యాటరైట్) తో పాటు నాపరాళ్ల రవాణాకు వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. తాండూరు మండలం ఓగీపూర్, కరణ్‌కోట్, మల్కాపూర్, సంగెం తదితర ప్రాంతా ల్లోని నాపరాతి గనుల నుండి వెలికి తీసిన నాపరాళ్లను నిర్ణీత స్థలాలకు రవాణా చేసేందుకు వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. దీంతో రోడ్డు తరచుగా పాడవడం నిత్యకృత్యమైంది రోడ్డును వాహనాల రద్దీకి అనుగుణంగా తట్టుకునేలా బాగుచేస్తేనే పది కాలాల పాటు రోడ్డు మనుగడ ఉంటుందని ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నారు.