సిద్దిపేట, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ ప్రయోజనాలు పట్టడం లేదని, ఆయన ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ… సీఎం తెలంగాణ భావజాలంపై అవగాహన లేదని, రాష్ట్ర హకుల పరిరక్షణలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదుల్లో మన హక్కు లు కాపాడడంలో సీఎం రేవం త్ విఫలమయ్యారని హరీశ్‌రావు ఆరోపించారు.
గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ ఎంబీ) చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 18 సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలన్నా, పునఃసమీక్షించాలన్నా ఎప్పుడూ ఎజెండాలో రాలేదని హరీశ్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను గత బీఆర్ ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొట్టి తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు సాధించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులపై సమీ క్ష అంశం తొలిసారిగా జీఆఎంబీ ఎజెండాలోకి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.ప్రభుత్వం వెంటనే జీఆర్ఎంబీ ఎజెండాను మార్చించాలని, అది సాధ్యం కాకపోతే సమావేశాన్ని బహిషరించాలని డిమాం డ్ చేశారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాల్లో ప్రధానమైనది నీటి హకుల సాధన అని గుర్తుచేశారు.
సిద్దిపేటతో జయశంకర్ సార్‌కు అనుబంధం
ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేయడం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర హకులను కాపాడడం, ముఖ్యంగా నీటి వాటాలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీపడవద్దని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. జయశంకర్ సార్‌తో సిద్దిపేటతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సిద్దిపేట బస్టాండ్ వద్ద జరిగిన దీక్షా శిబిరాలకు ఆయన అనేకసార్లు హాజరయ్యారని చెప్పారు. సిద్దిపేటలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి జయశంకర్ చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగిందన్నారు.
డిగ్రీ కళాశాల, ప్రెస్‌క్లబ్‌తో పాటు అనేక వేదికలపై తెలంగాణ ఆవశ్యకతను ప్రజలకు వివరించి ఉద్యమ స్ఫూర్తిని వ్యాప్తి చేశారని గుర్తు చేశారు. జయశంకర్ ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఒక ఉద్యమ శక్తి అని కొనియాడారు. రాజకీయ పరిస్థితులు మారినా, ఉద్యమం ఉధృతంగా ఉన్నా లేకున్నా, తెలంగాణ సాధనపై ఆయన సంకల్పం ఎప్పుడూ తగ్గలేదన్నారు. కేసీఆర్ వంటి నాయకత్వం వస్తేనే తెలంగాణ సాధ్యమవుతుందని జయశంకర్ నమ్మారని, ఆ నమ్మకానికే అను గుణంగా కేసీఆర్ వెన్నంటి నిలిచి ఉద్యమాన్ని విజయవంతం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేరొన్నారు. తాగునీటి సరఫరా, సాగునీటి విస్తరణ, 24 గంటల నాణ్యమైన విద్యుత్, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాపన, జీఎస్ డీపీ వృద్ధి, తలసరి ఆదాయం వంటి అనేక రంగాల్లో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఎదిగిందని వివరించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌కే దకుతుందని హరీశ్‌రావు అన్నారు.