టార్గెట్ రూ.564 కోట్లు
జిల్లాలోని మహి ళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)ను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నది. మహిళా సంఘాల సభ్యులు అధికంగా కిరా ణా షాపులు, గేదెలు, గొర్రెలు, మేకల కొనుగోలుకు, కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు రుణాలు తీసుకుంటున్నారు.
- ఈ ఏడాది ఎస్‌హెచ్‌జీలకు మంజూరు చేసే రుణాల లక్ష్యాన్ని నిర్దేశించిన అధికారులు
- గతేడాదితో పోలిస్తే రూ.13 కోట్లు అధికంగా పెంచుతూ నిర్ణయం
- మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా..
- వికారాబాద్ జిల్లాలో 15,023 సంఘాలుండగా 1.80,000 మంది సభ్యులు
వికారాబాద్, మే 15(నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మహి ళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)ను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నది. మహిళా సంఘాల సభ్యులు అధికంగా కిరా ణా షాపులు, గేదెలు, గొర్రెలు, మేకల కొనుగోలుకు, కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు రుణాలు తీసుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు గత ఆర్థిక సంవత్సరానికి మించి రుణాలను మంజూరు చేయాలని అధికారు లు నిర్ణయించారు. ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీ రుణాలకు రూ.564 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.13 కోట్ల రుణాలను అదనంగా పెంచా రు. కాగా, జిల్లాలో 657 గ్రామ సంఘాలుండగా, 15,023 స్వయం సహాయక సంఘాలు, 1,80,000 మంది సభ్యులు ఉన్నారు. ఎప్పటికప్పుడు రుణాలను చెల్లించి తిరిగి పొందే సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను మం జూరు చేస్తూ ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నా రు. సంఘాల పనితీరును బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు.
గతేడాది రూ.518 కోట్ల రుణాలు
జిల్లాలో ప్రతి ఏటా ఎస్‌హెచ్‌జీలకు లక్ష్యానికి తగినట్లుగా అధికారులు రుణాలను మంజూరు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 5,475 స్వయం సహాయక సంఘాలకు రూ.518 కోట్ల రుణాలను మంజూరు చేశారు. దోమ మండలంలో రూ.38.69 కోట్లు, మర్పల్లిలో రూ.34.99, కులకచర్లలో రూ.36.67, నవాబుపేటలో రూ.31.14, తాండూరులో రూ.36.95, మోమిన్‌పేటలో రూ.30.35, యాలాలలో రూ.30.07, బషీరాబాద్‌లో రూ.23.36, పరిగిలో రూ.23.87, బంట్వారంలో రూ. 21.60, చౌడాపూర్‌లో రూ.20.15, ధారూరులో రూ.26.33, పెద్దేముల్లో రూ. 26, పూడూరులో రూ.24.05, వికారాబాద్‌లో 13.29, దౌల్తాబాద్‌లో రూ.23.53, కొడంగల్‌లో రూ.24.40, కోట్‌పల్లిలో రూ.23.73, బొంరాస్‌పేట మండలంలో రూ. 28.76 కోట్ల రుణాలను మంజూరు చేశారు. విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామీణ మహిళలు వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు.
ఎన్పీఏలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మొండికేసిన సంఘాల నుంచి రుణాలను రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టింది. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఎస్‌హెచ్‌జీ సభ్యుల్లో అవగాహన కల్పిస్తున్నా జిల్లాలోని కొన్ని సంఘాల్లో ఇంకా మార్పు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా రూ.19 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. ఈ మొత్తాన్ని తిరిగి వసూలు చేసేందుకు డీఆర్డీవో యంత్రాంగం చర్యలు చేపట్టింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

