ఇబ్రహీంపట్నం, మార్చి 7 : ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాది వార్షిక పరీక్షలు రాసేందుకు విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లలో ఇబ్రహీంపట్నం కస్తూర్బాగాంధీ, సోషల్వెల్ఫేర్తోపాటు పలు కళాశాలలకు చెం దిన విద్యార్థినీవిద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.
కాగా, కస్తూర్బాగాంధీ విద్యార్థినులకు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంట ర్ పడింది. దీంతో వారిని పరీక్షలు ప్రారంభమైన రోజు నుంచి డీసీఎంలోనే హాస్టల్ నుంచి పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి ఎగ్జామ్ పూర్తి కాగానే తిరిగి వసతిగృహానికి తరలిస్తున్నారు. ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారు లు.. తమను ప్రైవేట్ వాహనంలో తరలించడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని విద్యార్థినులు పేర్కొంటున్నారు.