జిల్లాలో ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. పోర్టల్లో పరిశీలనలో ఉన్న 35 వేలకు పైగా పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పునఃపరిశీలించాలని తహసీల్దార్లకు తిరిగి పంపించడంపై సందిగ్ధత నెలకొన్నది. ఇప్పటివరకు ఆన్లైన్ రిపోర్టుల ఆధారంగానే కలెక్టర్ ఆమోదించడమో ? లేక తిరస్కరించడమో చేసేవారు.
అయితే ఇకపై ఆన్లైన్ రిపోర్టులతోపాటు మ్యానువల్ రిపోర్టులను కూడా క్షుణ్ణంగా పరిశీలించాకే ధరణి ఆర్జీలపై నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ భారతి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కాగా ధరణి దరఖాస్తుల పరిస్థితి మళ్లీ మొదటికే రావడంపై దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. కలెక్టర్ ఆమోదం లేకుండా ధరణిలో రిజిస్ట్రేషన్లు అయిన 98 దరఖాస్తులను రద్దు చేసే అవకాశం సీసీఎల్ఏకు మాత్రమే ఉండగా.. ఆ దిశగా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోనట్లు తెలుస్తున్నది.
రంగారెడ్డి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు..’ ఉంది రంగారెడ్డి జిల్లాలో ధరణి దరఖాస్తులదారుల పరిస్థితి. ఇద్దరు ఉద్యోగులు చేసిన అక్రమాలకు సా మాన్యులు సమిధలుగా మారారు. ‘ధరణి’లో వె లుగుజూసిన అక్రమాల నేపథ్యంలో జిల్లా యం త్రాంగం అలర్ట్ అయింది. పోర్టల్లో పరిశీలనలో ఉన్న దరఖాస్తులన్నింటినీ పునఃపరిశీలన కోసం తహసీల్దార్లకు తిరిగి పంపించారు. దీంతో ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న సుమారు 35వేలకు పైగా పెండింగ్ దరఖాస్తులపై సందిగ్థత నెలకొన్న ది. వివిధ భూ సమస్యల పరిష్కారం కోసం బాధితులు ఎంతోకాలంగా కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా.. పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో జరిగిన ధరణి అక్రమాలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఆన్లైన్ రిపోర్టుల ఆధారంగానే జిల్లా కలెక్టర్ ఆమోదించడమో? లేక తిరస్కరించడమో! చేసేవారు. అయితే ఇకపై ఆన్లైన్ రిపోర్టులతోపాటు మ్యానువల్ రిపోర్టులను సై తం క్షుణ్ణంగా పరిశీలించాకే ధరణి అర్జీలపై నిర్ణ యం తీసుకోవాలని కలెక్టర్ హోలీకేరీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ధరణి పోర్టల్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పునః పరిశీలన కోసం తహసీల్దార్లకు పంపించిన ట్లు తెలుస్తున్నది.
ధరణి పోర్టల్లో ఉన్న సుమా రు 35వేలకు పైగా దరఖాస్తులను తిరిగి వెనక్కి పంపినట్లు తెలుస్తున్నది. ప్రతి రికార్డును క్షుణ్ణం గా పరిశీలించిన తర్వాతనే తహసీల్దార్లు నివేదికలు పంపాలని ఆదేశించినట్లు సమాచారం. అర్జీలను ఆమోదించడమా? లేక తిరస్కరించడమా? అనేది కూడా నివేదికలో పొందుపర్చాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో అక్రమాలకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
భూ సమస్యల పరిష్కారం కోసం ఎంతోకాలంగా బాధితులు తహసీల్దార్, కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈరోజు కాకపోతే రేపు అయినా.. సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశలో బాధితులు ఉండ గా.. జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిస్థితి మళ్లీ మొదటికే రావడంపై వారు ఆవేదన చెందుతున్నారు. అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణ యం మంచిదే అయినప్పటికీ.. ఇద్దరు ఉద్యోగు లు చేసి న తప్పిదాలకు వేలాది మంది ఇబ్బందు లు పడాల్సి వస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ధరణి కోఆర్డినేటర్ నరేశ్, ఆపరేటర్ మహేశ్ ధరణిలో అక్రమాలకు పాల్పడ్డారు. అధికారులు అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో ఇద్దరు ఉద్యోగులు అక్రమ తతంగాన్ని నడిపించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోర్టు కేసులు, పెండింగ్ మ్యుటేషన్లు, నిషేధిత భూములు, అర్బన్ ల్యాండ్ పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించిన విలువైన భూములకు ఆమోదం లభించినట్లుగా రికార్డులు సృ ష్టించి ధరణిలో నమోదు చేశారు. మొత్తం 98 దరఖాస్తులను దొడ్డిదారిలో ధరణిలో నమోదు చేయడం సంచలనం సృష్టించింది.
కలెక్టర్కు తెలియకుండా దరఖాస్తులకు ఆమోదముద్ర వేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరిని సస్పెండ్ చేయడంతోపాటు కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కొనసా..గుతుండగా..98 అక్ర మ ధరణి రిజిస్ట్రేషన్ల రద్దుపై మాత్రం నేటికీ స్ప ష్టత కొరవడింది. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వ్యక్తుల వివరాలతోపాటు భూ వివరాల సమగ్ర సమాచారం కోసం పోలీసులు సీసీఎల్ఏకు లేఖ రాశారు. అవి వస్తేనే.. ఓ స్పష్టత వ స్తుందని అటు అధికారులు, ఇటు పోలీసులు చెబుతున్నారు.
అక్రమాలు వెలుగుజూసి ఇరవై రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు దీనిపై స్తబ్దతనే నెలకొన్నది. కలెక్టర్ ఆమోదం లేకుం డా ధరణిలో రిజిస్టర్ అయిన వాటిని రద్దు పర్చే అవకాశం సీసీఎల్ఏకు మాత్రమే ఉండగా.. ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోనట్లు తెలుస్తున్నది. దీంతో అక్రమ ధరణి రిజిస్ట్రేషన్లు రద్దు అయ్యాయా? లేదా? అనే దానిపై కూడా సందిగ్ధత కొనసాగుతున్నది. ఏదిఏమైనా అనేక సందేహాలు, అనుమానాలకు సీసీఎల్ఏ నివేదికతోనే నివృత్తి కలుగుతుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.