చేవెళ్ల రూరల్, మే 14 : ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఏదో అలా వచ్చి.. మధ్యాహ్నం వరకే డ్యూటీ చేసి.. ఆ తర్వాత పలాయనం చిత్తగిస్తున్నారు. దీంతో పలు సమస్యలను చెప్పుకొం దామని వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
బుధవారం చేవెళ్ల ఎంపీడీవో కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మధ్యాహ్న సమయంలో సంబంధిత శాఖల అధికారులు లేక ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. అక్కడ ఒక అటెండర్ మాత్రమే అందుబాటులో ఉన్నాడు. వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు అధికారులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో తిరిగి తమ ఇండ్లకు వెళ్లిపోయారు. ఈ విషయంపై ఎంపీడీవో హిమబిందును ఫోన్లో వివరణ కోరగా టైపిస్ట్ అందుబాటులో ఉన్నాడని సమాధానమిచ్చారు.