షాద్‌నగర్‌టౌన్, జూలై 31: లయన్స్‌క్లబ్ రీజియన్ చైర్మన్ మనోహర్‌రెడ్డి జన్మదిన సందర్భంగా లయన్స్‌క్లబ్ ఆఫ్ షాద్‌నగర్ సేవా సంకల్ప్ ఆధ్వర్యంలో గురువారం ఫరూఖ్‌నగర్ మండలం చిల్కమర్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్‌ను అందజేసినట్లు సేవా సంకల్ప్ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు.
విద్యార్థులకు నోట్‌బుక్స్‌ను అందజేసిన సేవా సంకల్ప్ సభ్యులకు పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జనార్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయులు సత్యం, సేవా సంకల్ప్ సభ్యులు భయంకర్రాజు, మదన్మోహన్, శివనాగయ్య, రామకృష్ణారెడ్డి, లక్ష్మిపతిరెడ్డి, విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.