వికారాబాద్, జూన్ 17 : వికారాబాద్ జిల్లా ఎస్పీగా కె.నారాయణ రెడ్డి నియమితులయ్యారు. శంషాబాద్ డీసీపీగా పని చేస్తున్న ఆయన్ను జిల్లా ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే జిల్లా ఎస్పీగా పని చేస్తున్న ఎన్.కోటిరెడ్డిని మేడ్చల్ జోన్ డీసీపీగా ప్రభుత్వం బదిలీ చేసింది. నేడు నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.