Nandigama : ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

- గ్రామాల్లో సమస్యలు లేకూండా చర్యలు తీసుకోవాలి
- సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
నందిగామ : ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం నందిగామ ఎంపీపీ ప్రియాంకగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు ఏజెండా చదివి వినిపించారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కావాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రల్లె ప్రగతితో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయ న్నారు. గ్రామాలకు మంజూరైన బీటీ రోడ్లు పూర్తి కాకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మంజూరైన సీసీ రోడ్లను సర్పంచ్‌లు ఎంపీటీసీలు చొరవ తీసుకుని పనులు పూర్తి చేయాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి, పైపులైన్ లికేజీలు లేకుండా చేసి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మంజూల, ఎంపీటీసీలు చంద్రపాల్‌రెడ్డి, రాజునాయక్, కట్న లతా, మాధవి, కళమ్మ, కో-ఆప్షన్ సభ్యులు బేగ్, సర్పంచ్‌లు కవిత, రాములమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజ్‌గోపాల్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

