తాండూరు, జూన్ 30 : తాండూరు పట్టణంలో డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తాం డూరు మున్సిపల్ మేనేజర్ నరేందర్‌రెడ్డిని మంగళవారం వికారాబాద్ కలెక్టర్ దీపక్‌తివారీ సస్పెండ్ చేశారు.
గత శనివారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కలెక్టర్ దీపక్ తివారీల ఆధ్వర్యంలో డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన విషయం తెలిసింది. కాగా, ఈ ఇండ్ల పంపిణీలో మజ్లిస్ పార్టీకి చెందిన నాయకులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రొటోకాల్ విషయంలో మున్సిపల్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కలెక్టర్ ఆయనపై వేటు వేశారు.