పరిగి, మే 3: చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నదని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ పేర్కొన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం శుక్రవారం పరిగిలోని బహార్‌పేట్ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు వర్గాల గొంతుకగా నిలిచిన కాసాని జ్ఞానేశ్వర్ చట్టసభలలో అడుగు పెట్టాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటు న్నా రని చెప్పారు. ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ బీసీ వర్గానికి చెందిన నాయకుడికి పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా మంచి నిర్ణయం తీసుకుందనే భావం వ్యక్తం చేస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ పాలన లో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని, అయిదు నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించడం ద్వారా తెలంగాణ గొంతుకను ఢిల్లీలో వినిపించే అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వారాల రవీంద్ర, బొంబాయి నాగేశ్వర్, ఎదిరె కృష్ణ, వెంకటేశ్, కో-ఆప్షన్ సభ్యుడు ముకుంద శేఖర్, నాయకులు తాహెర్‌అలీ పాల్గొన్నారు.
దోమ : కారు గ్తుకు ఓటు వేసి చేవెళ్ల ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శుక్రవారం మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, గొట్లచెల్కతండా, ఖమ్మంనాచారం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. కాంగ్రెస్, బీజేపీల మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని తెలిపారు. పార్లమెంటులో తెలంగాన గొంతుక వినిపించాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో యువ నాయకుడు రాఘవేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మర్పల్లి: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మధుకర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బూచన్‌పల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలను వివరించారు. కాంగ్రెస్ నాయకులు అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును మరిచిపోయారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
ధారూరు: బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కాసాని జ్ఙానేశ్వర్ను భారీ మెజా రిటీతో గెలుపించుకునేందుకు మండల నాయకులు మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయ కులు వేణుగోపాల్ రెడ్డి, రాములు, కావలి అంజయ్య, వెంకటయ్య, వెంకట్ రాంరెడ్డి, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
కులకచర్ల : మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ మాలె కృష్ణయ్యగౌడ్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం, కాంగారి బాలు, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పీరంపల్లిలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు ఆధ్వర్యంలో, తిర్మలాపూర్‌లో గ్రామ బీఆర్ఎస్ నాయకులు రాములు ఆధ్వర్యంలో, చాపలగూడెంలో మాజీ సర్పంచ్ గండి లక్ష్మయ్య ఆధ్వర్యంలో, ముజాహిద్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సారా శ్రీనివాస్, నాయకులు పెంటయ్య, మల్లేశం, శేఖర్ గ్రామస్తులతో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి గెలుపుకోసం ప్రచారం నిర్వహించారు.
– ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవాబుపేట, మే 3 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రజలను మోసం చేసి ఓట్లు అడగడం సిగ్గుచేటని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం నవాబుపేట మండల పరిధిలోని గుబ్బెడు ఫతేపూర్, గం గాడ గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కల్యాణలక్ష్మి పథకానికి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని ఇప్పటివరకు అమలు చేయడం లేదని వాపోయారు.
ఒక్క బస్సు సౌకర్యం మాత్రమే ఆడపిల్లలకు కల్పించి అబద్ధపు మాటలను ఆడుతున్నారన్నారు. రూ.500కే ఉచిత గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఇస్తామన్న రూ.2500 తదితర వాటిని అమలు చేయకుండా ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగడానికి వస్తున్న నాయకులను నిలదీయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.