తలకొండపల్లి నవంబర్ 23 : మండలంలోని మాదాయపల్లి గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఎంపీపీ నిర్మల ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బుధవారం క్రీడా దుస్తులను అందజేశారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అంబాజి, ఎస్ఎంసీ చైర్మన్ శంకర్, ఉపసర్పంచ్ జయమ్మ, శ్రీనివాసులు, అజీజ్, మల్లేశ్, జావేద్ఆలి, రమేశ్, శ్రీనివాస్, శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.