ఇబ్రహీంపట్నంరూరల్, మే 31 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందు కోసం ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలకు రూ.లక్ష చొప్పున మంజూ రు చేసింది. ఈ సందర్భంగా కొనసాగుతున్న పనులను శుక్రవారం ఎంపీపీ కృపేశ్ మండల పరిధిలోని పోల్కంపల్లి ప్రభుత్వ పాఠశాలలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. సైన్స్ పరికరాలు, ఎల్ఈడీ టీవీలతో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్ల వంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో క్రాంతికిరణ్, పంచాయతీరాజ్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఎంఈవో వెంకట్రెడ్డి, నోడల్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.