రంగారెడ్డి, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : బీసీల అభ్యున్నతికి జీవితాన్ని ధారబోసిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని బీసీ నేతలు కొనియాడుతున్నారు. 96 కులాలను ఐక్య వేదిక పేరుతో ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని కాసాని ఘనతను వివరిస్తున్నారు. పార్లమెంటులో బడుగు బలహీన వర్గాల గొంతుక వినబడాలంటే కాసానిని గెలిపించుకుని తీరాలని బీసీ సంఘాలు పిలుపునిస్తున్నాయి.
రాజ్యాధికారానికి దూరం కావడం వల్లనే బీసీలు రాణించలేకపోతున్నారని, చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో బీసీలకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకుందామని నేతలు పేర్కొంటున్నారు. బీసీలను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలతోపాటు నిస్వార్థంతో కూడిన ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించి బీసీల శక్తిని, ఐక్యతను చాటుదామని పిలుపునిస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా.. కాసాని వెన్నంటే ఉండి ఆయన గెలుపునకు కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా కాసాని విజయానికి పాటుపడదామని నేతలు కోరుతున్నారు.
బీసీలు కేవలం రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకులు కాదు. మాకంటూ ఎంతో ఆత్మాభిమానం ఉన్నది. పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను అధిక మెజార్టీతో గెలిపించుకుని మా సత్తా చాటుతాం. బీసీల్లో ఐక్యతపై కాంగ్రెస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. పార్టీలకు అతీతంగా బీసీలంతా ఈ ఎన్నికల్లో సమైక్యంగా నిలబడి బీసీ బిడ్డ కాసానిని గెలిపించుకుని బీసీలంటే అల్లాటప్పాకాదని నిరూపిస్తాం. బీసీ ఓటర్లు సైతం రాజకీయ పక్షాల మోసపూరిత మాటలను గుర్తించాలి. బీసీలకు ప్రాధాన్యతనిచ్చిన పార్టీకి అండగా నిలవాలి.
పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల అభ్యర్థిగా బీసీ బిడ్డ కాసానికి టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ ఈ వర్గంపై తన చిత్తశుద్ధిని చాటుకున్నది. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెనుకబడిన వర్గానికి చెందిన మా నేతను చేవెళ్లలో భారీ మెజార్టీతో గెలిపించుకుని బీసీల్లో ఐక్యతను నిరూపించుకుంటాం. ఇతర పార్టీలు బీసీ వర్గాలకు సీటు ఇవ్వకపోవటంతో పాటు పైగా అవహేళనగా మాట్లాడటం సరికాదు. బీసీలు సైతం ఈ ఎన్నికల్లో విజ్ఞతతో వ్యవహరించాలి. చేవెళ్లలో కాసానిని గెలిపించుకుని అహంకారపూరిత నేతలకు తగిన గుణపాఠం నేర్పాలి.
ఇంకా ఎంతకాలం బీసీలందరం ఒక్కటి కాకుండా ఉందాం. ఇప్పటికైనా ఏకమై అహంకారంతో బీసీలను చులకన చేసి మాట్లాడుతున్న నేతలకు బుద్ధి చెబుతాం. చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకొని బీసీల సత్తా ఏంటో చూపిద్దాం. ప్రతి ఇంటికి తిరిగి బీసీలను కూడగడుదాం. కొంతమంది అహంకారపరుల నోటికి తాళం వేయాలంటే మన ఓట్లు కాసాని జ్ఞానేశ్వర్‌కు వేసి గెలిపించాలి.
కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకోవడానికి ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తాం. బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నది. మనం తలుచుకుంటే బీసీ అభ్యర్థి గెలువడమనేది పెద్ద సమస్య కాదు. ప్రతి బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్‌కు ఓట్లు వేసి గెలిపించుకుందాం. కారు కూతలు కూస్తున్న వారికి కంట్లో కారం కొట్టిన్నట్లు కావాలి. బీసీలను ఇంత చులకన చేస్తున్న వారికి గుణపాఠం చెప్పుదాం.
తెలంగాణలో బీసీ సంక్షేమం కోసం పాటుపడిన ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. చెవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ నాయకుడికి టికెట్ కేటాయించడం హర్షణీయం. బీసీ ఓటర్లు అందరూ ఏకమై కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్రావును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది.
బీసీలు రాజకీయంగా ఎదుగాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు బీసీలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మంది బీసీలకు పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు. బీసీలందరూ బీసీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలింపించుకోవాలి.
పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపొందడం ఖాయం. 50 శాతం సీట్లు బీసీలకు కేటాయించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలమంతా ఏకతాటిపైకి వచ్చి కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకుని పార్లమెంట్‌కు పంపిద్దాం. చేవెళ్ల గడ్డపై బీసీల సత్తా చూపుదాం.
బీసీ నేతను ఎంపీగా గెలిపించుకుంటే బీసీల గొంతును పార్లమెంట్లో వినిపిస్తారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా ఎంతో సేవ చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌కు ఈ ప్రాంతంపై మంచి పట్టున్నది. ఎన్నో రోజుల తర్వాత ఒక బీసీ నాయకుడికి అవకాశం వచ్చింది. ఇతర పార్టీల్లో బీసీలను పట్టించుకునేవారే కరువయ్యారు. పార్టీలకతీతంగా ఏకతాటిపైకి వచ్చి మన ఓటు మన నాయకుడికే వేసుకుని భారీ మెజార్టీతో బీసీ నేత జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకుందాం.
బీసీలపై కాంగ్రెస్ నేతలు అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. తిరిగి బీసీలనే అవమానపర్చేలా మాట్లాడడం సిగ్గుచేటు. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు అహంకార నాయకులకు చెంపపెట్టు కావాలి. కాసాని విజయం కోసం బీసీలు సైనికుల్లా ముందుకు కదలాలి.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప నేత కాసాని జ్ఞానేశ్వర్‌ను సీఎం కేసీఆర్ గుర్తించి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఆయా మండలాలు, గ్రామాల బీసీలందరం మూకుమ్మడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను బలపరుస్తూ రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకొని బీసీల సత్తా చాటాలి.
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా టీఆర్ఎస్ తరఫున బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్‌కు మంచి అవకాశం కల్పించడం సంతోషకరం. బీసీలకు దమ్ముంటే కాసానిని ఎంపీగా గెలిపించుకోవాలని ఓ నాయకుడు విసిరిన సవాలుకు మనమందరం ఏకమై ఓటు ద్వారా సమాధానం చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరం ఉన్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జడ్పీ చైర్మన్‌గా చేసిన అనుభవం జ్ఞానేశ్వర్‌కు ఉన్నది. అత్యధికంగా ఉన్న బీసీలంతా పార్టీలకతీతంగా ఆయనకు ఓటేయాలి.
బీసీలందరం ఏకతాటిపైకి వచ్చి రానున్న ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం. అప్పుడే బీసీల ఐక్యత సమాజానికి చాటినట్లు అవుతుంది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ వర్గానికి పెద్దపీట వేసి బీసీలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. బీసీల సత్తాను చాటేందుకు ప్రతి బీసీ బిడ్డ ఓ సైనికుడై బీసీ నాయకుడి గెలుపునకు కృషి చేయాలి.
96 కులాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ను అత్యధిక మెజార్టీ గెలిపించి మా బీసీల సత్తా చాటుతాం. ఓట్ల సమయంతో బీసీలను పావులుగా వాడుకొని అధికారం దక్కించుకుంటున్న రెడ్డి వర్గానికి చెందిన నాయకులకు పార్లమెంట్ ఎన్నికల్లో చుక్కలు చూపిస్తాం. చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తాం. మాట్లాడే ముందు కులమతాలకు అతీతంగా మాట్లాడాలనే విషయాన్ని ఆయా పార్టీల నాయకులు గుర్తుంచుకొని మాట్లాడాలి.
బీఆర్ఎస్ అధినేత బీసీ నాయకుడికి ఇచ్చిన అవకాశాన్ని బీసీలందరూ ఏకమై సద్వినియోగం చేసుకోవాలి. అహంకారంతో మాట్లాడే నాయకులకు ఓట్లతో బుద్ధి చెప్పాలి. బీసీల మధ్య చిచ్చుపెట్టి ఏకం కాకుండా చేస్తున్నారనే విషయాన్ని బీసీలు గమనించి ఐక్యతతో ముందుకెళ్లాలి. కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకుని సత్తా చాటుదాం. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి మన ఐక్యతను చాటిచెప్పాలి. అగ్రకులాల నేతలు మనందరినీ ఓటు రాజకీయాలకు బలిపశువుల్లా వాడుకుంటున్నారు.