హయత్‌నగర్ రూరల్, ఏప్రిల్ 1 : రాష్ట్రంలో దాదాపు పదిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలు దాటిందంటే అడుగు గడప బయటకు పెట్టే పరిస్థితులు కనిపించడంలేదు. ఇక మధ్యాహ్నం గురించి చెప్పనక్కర్లేదు. ఉదయం 7 గంటల నుంచే ఉక్కపోత మొదలువుతున్నది. అయితే శుక్రవారం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఉదయం పొగమంచు కురిసింది. వాతావరణం చల్లగా మారింది. మళ్లీ 10 గంటల తర్వాత మాత్రం ఎండ దంచికొట్టింది. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని తట్టిఅన్నారం- పెద్దఅంబర్‌పేట ప్రధాన రహదారిపై ఉదయం, మధ్యాహ్నం వాతావరణ పరిస్థితులు ఇలా కనిపించాయి.