షాద్‌నగర్, నవంబర్ 23 : కాంగ్రెస్ మాయమాటలు, మోసపూరిత హామీలను నమ్మితే మనం ఆగమైతమని, అభివృద్ధి కుంటుపడిపోతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం చౌదరిగూడ మండలంలోని తుమ్మలపల్లి, లచ్చంపేట, ఎల్కగూడ గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో మాట్లాడారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్‌కు అప్పగిస్తే మన బతుకులు ఆగమైతవి అనే విషయాన్ని గ్రహించాలని, ఒక్కసారి కాంగ్రెస్ పాలనను గుర్తు తెచ్చుకొని ఆలోచించాలని అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మన షాద్‌నగర్‌లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, మరోమారు కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బంగారు స్వరూప, నాయకులు బంగారు రాములు, దామోదర్‌రెడ్డి, మచ్చ సుధాకర్, బాబురావు పాల్గొన్నారు.
శంకర్పల్లి, నవంబర్ 23 : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్నే గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని శేరిగూడ, లక్ష్మారెడ్డిగూడ, రామంతాపూర్, సంకేపల్లి, అంతప్పగూడ, పర్వేద గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టవద్దని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, చైర్పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్‌కుమార్, జడ్పీటీసీ గోవిందమ్మ, ఏఎంసీ చైర్మన్ పాపారావు, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, సర్పంచ్‌లు మైలారం సత్యనారాయణ, ఇందిర, అనిత, ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్ అశోక్, నాయకులు గోపాల్, వాసుదేవ్‌కన్నా, ఇంద్రసేనారెడ్డి, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కేశంపేట : తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్ అన్నారు. మండలంలోని సంగెంలో గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీల మాయ మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ర్యాలీలో అధికసంఖ్యలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు యెన్నం గోపాల్‌రెడ్డి, వేణుగోపాలచారి, పుట్టోనిగూడెం యాదగిరి, బల్వంతరెడ్డి, వంశీగౌడ్, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
షాబాద్ : గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. షాబాద్ మండలంలోని సర్దార్‌నగర్, కక్కులూర్, కొమరబండ, మక్తగూడ, చందనవెల్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : అభివృద్ధి కోసం మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్‌ను గెలిపించాలని బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు.
కొత్తూరు : అభివృద్ధి కావాలంటే మళ్లీ అంజన్ననే గెలువాలని మల్లాపూర్ తండా సర్పంచ్ రవినాయక్ అన్నారు. కొత్తూరు మండలంలోని మల్లాపూర్ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో లక్ష్మణ్ నాయక్, కేతావత్ రవినాయక్, రమావత్ శంకర్‌నాయక్, మోహన్ నాయక్, నరేశ్, సాయికుమార్, చందు, మోహన్ పాల్గొన్నారు.
కొత్తూరు మున్సిపాలిటీలోని తిమ్మాపూర్‌లో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారుగుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను గెలిపించాలని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. కార్యక్రమంలో కొస్గి యాదయ్య, నాగరాజు, బాస్కర్‌గౌడ్, పెద్దపురం శ్రీనివాస్, చంద్రయ్య పాల్గొన్నారు.
నందిగామ : మండలంలో బీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను గెలిపించాలని కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది.