నందిగామ, మే 15 : నందిగామ మండలం చేగూరు శివారులో ఏర్పాటు చేస్తున్న 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. సబ్‌స్టేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సూచించారు. గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యలు రాకుండా వ్యవసాయ, గృహాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, నాయకులు నర్సింహ, కుమారస్వామిగౌడ్, కృష్ణయాదవ్, వీరేందర్‌గౌడ్, బుచ్చయ్య పాల్గొన్నారు.
కొత్తూరు, మే 14: మండల పరిధిలోని ఫాతిమాపూర్లో ఫాతిమా మాత ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫాతిమా మాత తిరునాళ్ల మహోత్సవాన్ని చూడటానికి క్రిష్టియన్లు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషమని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు విజయపాల్‌రెడ్డి, నర్సప్పగూడ మాజీ సర్పంచ్ కృష్ణ, మహేశ్‌గౌడ్, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.