షాద్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 23: స్వచ్ఛతే జీవితంగా బతికిన మహనీయుడు సంత్ గాడ్గే బాబా అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ దొంతుల సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గాడ్గే బాబా చిత్ర పటానికి బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాడ్డే బాబా తన జీవి తాంతం పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, స్వచ్ఛ భారత్ కోసం ఆయన చేసిన కృషి మరువలేదన్నారు.
అంట రానితనాన్ని నిర్మూలించడం కోసం, మూఢనమ్మకాల నుంచి సమాజాన్ని మేల్కోల్పిన యోధుడు సంత్ గాడ్గే బాబా అని అన్నారు. ప్రతి రోజూ ఏదో ఒక ఊరు వెళ్లి ఊరంతా శుభ్రం చేసేవారన్నారు. బిడ్డ పుడితే జంతుబలి ఇచ్చే ఆచారాన్ని మహా రాష్ట్ర నుంచి తరిమేసిన చైతన్యశీలి గాడ్గే బాబా అని కొని యాడారు. అనంతరం జననాయక్ భారతరత్న కర్పూర్ ఠాకూ ర్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీశైలం, శ్రీనివాస్, అందె మోహన్, ఊషన్న, సత్యం, రమణ, శేఖర్, గోపాల్‌నారాయణ, రమేశ్, బాల్‌రాజ్, మాణిక్యం, దాసు, యాదయ్య, నవీన్‌కుమార్, శేఖర్, రంజిత్ పాల్గొన్నారు.