కొత్తూరు, ఫిబ్రవరి 1: గ్రామ సమస్యల పరిష్కారంలో సర్పంచ్ల పాత్ర మరువలేనిది అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సర్పంచ్ల పదవీకాలం జనవరి 31తో ముగియడంతో ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే మాట్లాడారు. ఐదేండ్లుగా సర్పంచ్ల గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు.
ప్రతి గ్రామాల్లోనూ ఏ సమస్య వచ్చినా మనం ముందుగా వెళ్లేది సర్పంచ్ వద్దకే అని అన్నారు. అలాంటి సర్పంచ్‌లు నిరంతం ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌లు కాట్నరాజు, రవినాయక్, బ్యాగరి సత్యయ్య, రమాదేవి, వసుంధరమ్మ, వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, తులసమ్మ, అజయ్‌నాయక్, సంతోష్‌నాయక్, అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : పదవీ కాలం పూర్తి చేసుకున్న సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులకు గురువారం ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఘనంగా సన్మానించారు. మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనయ్యతోపాటు పాలక వర్గ సభ్యులకు నాయకులు సన్మానించారు. అనంతరం ఇటీవల కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ మల్టీపర్పస్ వర్కర్‌గా పురస్కారం అందుకున్న జంగయ్యను పాలక మండలి సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కడ్తాల్ : గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సాయిలు అన్నారు. గురువారం మండల పరిధిలోని మక్తమాదారం, గోవిందాయిపల్లి, మైసిగండి గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ విరమణ సన్మానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు తులసీరాంనాయక్, సులోచన, రవీందర్, ఎంపీటీసీ మంజుల, ఉప సర్పంచ్‌లు ఎల్లాగౌడ్, గణేశ్, వార్డు సభ్యులు యాదగిరి, జెనీల్కుమార్, రాందాసు, శంకర్, రాజేశ్‌గౌడ్, మహేశ్‌గౌడ్, ముసలయ్య, నారాయణ, పత్యానాయక్, ప్రేమ, యుమున, నీల, బుజ్జి, లక్ష్మి, అశ్విని, జ్యోతి, కవిత, కోఆప్షన్ సభ్యులు పుష్ప, లక్ష్మమ్మ, బాబా, భిక్షపతి, పంచాయతీ కార్యదర్శులు
షాద్‌నగర్ : చౌదరిగూడ మండల కేంద్రంలో సర్పంచ్‌లను జడ్పీటీసీ బంగారు సర్వరూప ఘనంగా సన్మానించారు. ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. పదవిలో లేకపోయిన ప్రజల బాగుకోసం పనిచేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. రాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : మజీద్‌పూర్ గ్రామస్తుల సమన్వయంతోనే అభివృద్ధికి కృషి చేశామని సర్పంచ్ పోచంపల్లి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఐదు సంవత్సరాల సర్పంచ్ పదవీ కాలం ముగింపు సందర్భంగా ఆత్మీయ వీడ్కోలును ఘనంగా నిర్వహించి పాలకవర్గ సభ్యులు, సిబ్బందిని సన్మానించారు. విశ్వకర్మ సంఘం నేతులు కూడా సన్మానించారు.కార్యక్రమంలో నారోజు రాజారాంచారి, బ్రహ్మచారి, వెంకటేశ్‌చారి, ఎర్రవెల్లి సాయిచారి, జిన్నోజు వెంకటాచారి, జీనోజు మారుతి ప్రసాద్, చిన్నోజు విజయ్‌చారి, మహేందర్చారి పాల్గొన్నారు.
శంకర్పల్లి : ఐదేండ్లుగా సహకరించిన గ్రామస్తులకు రుణపడి ఉంటానని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్ రవీందర్‌గౌడ్ అన్నారు. గురువారం మిర్జాగూడ పంచాయతీలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో సర్పంచ్, వార్డు సభ్యులను గ్రామస్తులు సన్మానించారు. పదవి లేకున్నా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం లో ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఉప సర్పంచ్ శాంతి, వార్డు సభ్యులు సురేందర్‌రెడ్డి, రాజుగౌడ్, ప్రవీణ్‌కుమార్, శివయాదవ్, చిట్టెమ్మ, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు అంజయ్య పాల్గొన్నారు.