వనస్థలిపురం, ఫిబ్రవరి 23 : ద్విచక్ర వాహనాల మెకానిక్లు, ఆటోమొబైల్ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. వనస్థలిపురం టూ వీలర్ మెకానిక్, ఆటోమొబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చింతలకుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు తన దృష్టికి తీసుకు వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ఖు నియోజకవర్గంలో కొంత స్థలం కేటాయించాలని తమ దృష్టికి తీసుకువచ్చారని అవకాశం ఉన్నచోట స్థలం కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు.
సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పొల్యూషన్ తగ్గించాల్సిన బాధ్యత కూడా మెకానికులపై ఉందన్నారు. వాహన కాలుష్యం వలన భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడుతుందని, దానిని తగ్గించే శక్తి మెకానిక్ల దగ్గర ఉందన్నారు. ఈ సందర్భంగా కొన్ని రోజుల క్రితం మరణించిన నరేష్ అనే మెకానిక్ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు చింతల రవికుమార్, అసోసియేషన్ సభ్యులు అరవింద్ రెడ్డి, మెయిన్, నరేందర్ రెడ్డి, ప్రసాద్,దామోదర్ గౌడ్, అజయ్,నర్సింహా యాదవ్,షేక్ షరీఫ్,హెచ్.బి.సీ.ఎల్.కంపెనీ సభ్యులు సురేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.