పరిగి, జూన్ 2: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పరిగి పట్టణంతోపాటు మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేసి అవతరణ ఉత్సవా లను వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా పరిగిలోని కోర్టు వద్ద జూనియర్ సివిల్ జడ్డి నాగుల శిల్ప, క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే టి.రామ్మో హన్‌రెడ్డి, మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల పరిషత్ వద్ద ఎంపీపీ అరవిందరావు, పంచాయతీరాజ్ అతిథిగృహం వద్ద జడ్పీటీసీ బి.హరిప్రియ,
మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఆనంద్‌రావు, డీఎస్పీ కార్యాలయం వద్ద డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, పీఏసీఎస్ కార్యాలయం వద్ద పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమాలలో పరిగి మాజీ సర్పంచ్ సిద్ధాంతి పార్థసారథి, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు బి. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, లాల్‌క్రిష్ణప్రసాద్, ఎ.క్రిష్ణ, బి.రవికుమార్, అన్వర్‌హుస్సేన్, కౌన్సిలర్లు మునీర్, వారాల రవీంద్ర, ఎదిరె క్రిష్ణ, వెంకటేశ్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తాండూరు: రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురాలు తాండూరు నియోజకవర్గం లో ఘనంగా జరిగాయి. రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, పలు సేవా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల వారు జాతీయ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా నేతలు మాట్లా డుతూ అమరుల త్యాగం, తెలంగాణ ప్రజల సంఘటిత పోరాటంతో 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందన్నారు. బంగారు తెంగాణ సాధనకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కృషి చేయాలన్నారు. కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
వికారాబాద్: వికారాబాద్, మోమిన్‌పేట, కోట్‌పల్లి, బంట్వారం, మర్పల్లి, ధారూరు, నవాబుపేట మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయజెండాను ఎగురవేశారు. వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మున్సిపల్ కార్యాలంలో చైర్ పర్సన్ మంజుల జెండా విష్కరణ చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి జెండాను ఎగుర వేశారు. జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి జెండాను ఆవిష్క రించారు. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
కొడంగల్: మున్సిపల్ పరిధిలోని కడా కార్యాలయంలో ప్రత్యేకాధికారి వెంక ట్‌రెడ్డి జెండాను ఎగరవేశారు. స్థానిక మార్కెట్‌యార్డ్, ఎంపీడీవో, ఎంఈవో, వ్యవసాయ, ఐసీడీఎస్, మహిళా సమాఖ్య, మున్సిపల్, ఫారెస్టు, ఎక్సైజ్, వెటర్నరీ, పీఏసీఎస్, తహసీల్దార్ కార్యాలయాల్లో అధి కారులు జాతీయ జెం డాను ఎగరవేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి జెండాను ఎగరవేశారు.
బొంరాస్‌పేట: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి వేడుకలు ఆదివారం బొంరాస్‌పేట, దుద్యా ల మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రభు త్వ, ప్రైవేటు కార్యాల యాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలపై ఎంపీ పీ హేమీబాయి, రవి, ఉన్నత పాఠశాలలో జీహెచ్ఎం హరిలాల్, పీఏసీఎస్‌లో చైర్మన్ జయకృష్ణ జాతీయ జెండాలను ఎగురవేశారు. పీహెచ్సీ, సబ్స్టేషన్లలో అధికారులు జెండాలు ఎగురవేశారు. మండల కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహులుగౌడ్ జెండా ఎగురవేశారు. వేడుకల్లో ఎంపీడీవో వెంకన్‌గౌడ్, ఎంపీటీసీలు, పార్టీల నేతలు పాల్గొన్నారు.