యాచారం, సెప్టెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్లో నూతనంగా మంజూరైన 1369మంది లబ్ధ్దిదారులకు ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను మంగళవారం ఆయన అందజేశారు. అదేవిధంగా కల్యాణలక్ష్మి పథకం కింద 28 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మండలంలో ఏకంగా 1369 నూతన పింఛన్లు రావడం సంతోషకరమన్నారు. ప్రతి పింఛన్ దారుడికీ ప్రభుత్వ గుర్తింపు కార్డును అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకొని పింఛన్లు రానివారికి ఇప్పించడానికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. యాచారంలో ఉన్న ప్రభుత్వ దవాఖానకు నూతన భవనాన్ని మంజూరు చేయడంతో పాటు అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. దళితుల అభ్యుతన్నతి కోసం దళితబంధు పథకం ద్వారా మరో 500ల మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. సీఐ లింగయ్య భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, తహసీల్దార్ సుచరిత, ఎంపీడీవో విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పాచ్ఛ భాష, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మంచాల : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన గొర్రె, మేకల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికల్లో గెలుపొందిన చైర్మన్ చిందం జంగయ్య, వైస్ చైర్మన్ చెరుకు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి బైకని మహేందర్ యాదవ్‌తో పాటు డైరెక్టర్లు మంగళవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గెలుపొందిన వారు సభ్యులకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చీరాల రమేశ్, కురుమ, యాదవ సంఘం నాయకులు పుణ్యమూర్తి, మారమ్మ, జంగమ్మ, కుమార్, మార శ్రీశైలం, రావుల యాదయ్య, యాదయ్య, రఘుపతి, ఐలయ్య, రాము, శేఖర్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన ఆసరా పింఛన్ లబ్ధిదారులు