ఉప్పల్ : ఉప్పల్ నియోజక వర్గం పరిధిలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు, మీడియా మిత్రుల సంక్షేమం కోసం శాయశక్తుల కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి(MLA Lakshma Reddy )అన్నారు. సోమవారం సైనిక్ పురిలోని ఉప్పల్ ఎమ్మెల్యే నివాసం వద్ద మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టీయూడబ్ల్యూజే 2025 డైరీనిఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తేవాలన్నారు. మీడియా మిత్రులందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి వెంకట్రాంరెడ్డి, జిల్లా నాయకులు మల్కయ్య, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రమోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, జాయింట్ సెక్రటరీలు అక్బర్, రాములు, కాప్రా ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, ప్రధాన కార్యదర్శి శంకర్, సహదేవచారి, శ్రీనివాస్, శ్రీధర్ రావు, ఉప్పల్ నియోజకవర్గం ప్రతినిధులు మహేందర్ రెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.