కడ్తాల్, సెప్టెంబర్ 3 : కల్వకుర్తి నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కడ్తాల్ మండల పరిధిలోని రేఖ్యా తండా గ్రామ పంచాయతీలోని టాక్‌రాజ్‌గూడ తండాలో రూ.5 లక్షలతో చేపట్టిన తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, పీఏసీఎస్, ఏంఎసీ డైరెక్టర్లు వెంకటేశ్, డాక్టర్ శ్రీనివాస్, ఆజీమ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ శ్రావ్య, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, భీక్యానాయక్, నర్సింహా, బీచ్యానాయక్, యాదగిరిరెడ్డి, తిరుపతిరెడ్డి, మల్లేశ్‌గౌడ్, పర్వతాలుయాదవ్, హరిచంద్‌నాయక్, జగన్, బలరాం, కోట్యా, బాలరాజు, రామకృష్ణ, అశోక్, షాబుద్ధీన్, జైపాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.