చేవెళ్ల రూరల్ , అక్టోబర్ 31 : చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు తనను మరోమారు ఆదరించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్ల మండలంలోని మల్లారెడ్డిగూడ, ఎర్రోని కొటాల, పల్గుట్ట, కందవాడ, నారాయణ్‌దాస్ గూడ గ్రామాల్లో సర్పంచ్ మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ రవీందర్ యాదవ్‌తో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్లిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కనిపించే వారి మాటలు నమ్మవద్దని, వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారో ప్రజలు ఆలోచించాలని కోరారు. మరింత అభివృద్ధికి మరోసారి ఆశీర్వదిస్తే మీకు సేవకుడిగా పని చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, చేవెళ్ల వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాసన్నగారి మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఎదిరె రాములు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శేరి శివారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివనీల చింటు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నాయకులు రవికాంత్‌రెడ్డి, రామాగౌడ్, రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జు రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు నరేందర్ గౌడ్, హన్మంత్ రెడ్డి, సర్పంచ్‌లు శేరి స్వర్ణలత, వెంకటేశం గుప్తా, విజయలక్ష్మి, భీమయ్య, లావణ్య, సామ మాణిక్యరెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధే ముందు ఉన్న లక్ష్యం
షాద్‌నగర్‌రూరల్ : షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యం అని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని చౌడమ్మగుట్టతండా, అన్నారం, అన్నారం తండా, రామేశ్వరం, జోగమ్మగూడ తండా, రాయికల్ గ్రామాల్లో మంగళవారం సహకర పరపతి సొసైటీ రాష్ట్ర చైర్మన్ రాజావరప్రసాద్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఎంతో అభివృద్ధి సాధించామని, మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉమ్మడి పాలనలో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, స్వరాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. తండాలను అభివృద్ధి పరిచి మరో సంతుసేవాలాల్ మహారాజుగా సీఎం కేసీఆర్ గిరిజనులు గుండేలా చిరస్థాయిగా నిలిచారన్నారు.
గులాబీమయంగా గ్రామాలు
ఫరూఖ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు సంపూర్ణ మద్దతు పలికారు. గ్రామాలు, తండాలు గులాబీమయంగా మారాయి. నియోజక వర్గంలోని మరో కాశీ శైవ క్షేత్రంగా ప్రసిద్ధ్దిగాంచిన ఉత్తరరామలింగేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రాములుగౌడ్, సంపత్‌కుమార్, రాఘవేందర్‌గౌడ్, శ్రీశైలంయాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, ఎంపీటీసీ శివరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే మరింత అభివృద్ధి
షాద్‌నగర్‌టౌన్ : బీఆర్ఎస్తోనే రాష్ట్రం మరింత అభివృద్ధిని సాధిస్తుందని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. మున్సిపాలిటీలోని 17వ వార్డులో కౌన్సిలర్లు సర్వర్‌పాషా, జీ.టీ శ్రీనివాస్, అంతయ్య, నందీశ్వర్, నాయకులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. కారుగుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అహర్నిశలు ప్రజల గురించి ఆలోచన చేసే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ప్రకాశ్, చెన్నయ్య, సలీం, శ్రీనివాస్, అశోక్, రాఘవేందర్‌రెడ్డి, శేఖర్, రఘు, సునీల్‌రెడ్డి, రాజు, భాస్కర్ పాల్గొన్నారు.
అభివృద్ధికి పట్టం కట్టండి
కొత్తూరు : అభివృద్ధికి పట్టం కట్టాలని కొత్తూరు మున్సిపాలిటీ, మండల మున్సిపాలిటీ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పీనియర్ నాయకుడు దేవేందర్యయాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కొస్గి శ్రీనివాసులు, ఎంపీటీసీ రాజేందర్, నాయకులు బ్యాగరి యాదయ్య, జనార్దనచారి, గోవింద్‌రెడ్డి, సిటీ కేబుల్ వెంకటేశ్, రాఘవేందర్‌యాదవ్, శ్రవణ్, జంగగళ్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో పలుగ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మల్లాపూర్ మధుసూదర్‌రావు ఆధ్వర్యంలో ప్రాచారం నిర్వహించారు. మల్లాపూర్ తండాలో లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గూడూరు సర్పంచ్ బ్యాగరి సత్తయ్య ఆధ్వర్యంలో ప్రాచారం నిర్వహించారు.
బీఆర్ఎస్కే గొల్లకురుమల మద్దతు
షాద్‌నగర్‌రూరల్ : బీఆర్ఎస్ పార్టీకే తమ సంపూర్ణ మద్దతు అంటూ ఫరూఖ్‌నగర్ మండలంలోని మధురాపూర్ గ్రామానిక చెందిన గొల్లకురుమలు కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్థిక ఎదుగుదల కోసం ఉచితంగా గొర్రెలను పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు.
మొయినాబాద్ :ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీళ్లు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ మైనార్టీ విభాగం విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.60 ఏండ్ల పాటు పాలించిన వివిధ పార్టీల ప్రభుత్వాలు ప్రజలకు మంచినీళ్లు అందించాలనే సోయి లేకుండా పోయిందన్నారు. స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీటిని అందిస్తున్నదన్నారు. ప్రతిపక్ష పార్టీల మాయమాటలను నమ్మవద్దన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమలలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, వైస్ ఎంపీపీ ఎం మమత, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, బాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింహ్మగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, మాజీ వైస్ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, డప్పు రాజు, బీఆర్ఎస్ లీగల్ సెల్ మండల అధ్యక్షుడు సురేందర్‌గౌడ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ముజ్జు, యువజన విభాగం మండల అద్యక్షుడు పరమేశ్, సర్పంచ్‌లు శ్రీనివాస్, కుమార్, ఎంపీటీసీ బట్టు మల్లేశ్, నాయకులు జగన్మోహన్రెడ్డి,షేక్ మహబూబ్, గణేశ్‌రెడ్డి, ఎండీ పాష, హైమద్, ఈశ్వర్ పాల్గొన్నారు.