షాబాద్, డిసెంబర్ 10: ప్రభుత్వ పథకాలను అర్హులైన ల బ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగం గా చేపట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించా రు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10లక్షల బీమా కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అ మలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీవో సాయిరాం, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి, జిల్లా ఉప వైద్యాధికారి దామోదర్,
తహసీల్దార్ కిష్టయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు వెంకటరంగారెడ్డి, పాపారావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ప్రభాకర్, పీఏసీఏస్ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, స ర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, నరహరిరెడ్డి, ఎంపీటీసీ రాము లు, మైనారిటీ అధ్యక్షుడు అలీ, నాయకులు శంకర్, రాజేందర్‌గౌడ్, నాగార్జునరెడ్డి, ఆగిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గిరిధర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యాదయ్యను ఎంపీపీతో పాటు పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపా రు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, మా ర్కెట్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, సర్పంచ్‌లు మాణిక్యారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నరహరి రెడ్డి, శేరి దర్శన్, శంకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమి టీ డైరెక్టర్ వెంకటేశ్, కృష్ణ, సీనియర్ నాయకులు అలీ, రాజు, శేరి రాజు, రవి తదితరులు ఉన్నారు.
మొయినాబాద్ : మండల పరిధిలోని మొయినాబాద్‌కు చెందిన జయాకర్ రోడ్డు ప్రమాదంలో గత కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. ఆయన పేరుపై బీఆర్ఎస్ పార్టీ ప్ర మాద బీమా సౌకర్యం కల్పించింది. మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో వచ్చిన రూ.2లక్షల ఆర్థికసాయాన్ని ఆదివా రం ఎమ్మెల్యే కాలె యాదయ్య అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కుటుంబ స భ్యులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రవూఫ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మ హేందర్‌రెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు ప రమేశ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ముజ్జు, సీనియర్ నాయులు షేక్ మహబూబ్, మోహిన్, సూరీయాదవ్, షాబాద్ ప్రవీణ్‌కుమార్, కృష్ణ,ప్రమోద్, రవి పాల్గొన్నారు.