తలకొండపల్లి, నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కరెంట్ కష్టాలు తప్పవని పక్కరాష్ట్రంలో కరెంట్ కష్టాలు మనకూ తప్పవని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని చంద్రధన గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 80 మంది నాయకులు గ్రామ ఉపసర్పంచ్ సుధాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. గ్రామాలో ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి చేరుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ రాష్ట్ర వైస్ చైర్మన్ వెంకటేశ్, రాములు, శ్రీరాములు, రామకృష్ణ, మల్లయ్య, బుచ్చయ్య, విజయ్, చందు, సాయిరెడ్డి, కుర్మయ్య, శివుడు, చెన్నయ్య, అశోక్, వినోద్, శేఖర్, యాదయ్య, దగిరి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆమనగల్లు : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. కడ్తాల్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని మేడిగడ్డ గ్రామ పంచాయతీకి చెందిన 20 మంది, ఆమనగల్లు మున్సిపాలిటీలోని బీసీ కాలనీకి చెందిన 30 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్ష నాయకులకు మతి భ్రమించి ఏవేవో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదని, వారు ఆరు గ్యారెంటీలు అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బీజేపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దన్నుకోవాలనే చూస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్ గుప్తా, ఏఎంసీ వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నేనావత్ పత్యానాయక్. కడ్తాల్ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ ఖలీల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వస్పుల సాయిలు, శ్రీను, పంతు, ఎంగలి రఘు, తోట కృష్ణ పాల్గొన్నారు.