ఆమనగల్లు, జూన్ 12 : సీఎం కేసీఆర్‌ను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ప్రగతిభవన్‌లో మర్యాద పూర్వకం గా కలిశారు.
అనంతరం నియోజకవర్గంలో కేఎల్ఐ డీ-82 కాలువ కింద భూములు కోల్పోయిన బాధిత రైతులకు వివిధ కారణాలవల్ల నిలిచిపోయిన రూ.8 కోట్లు విడుదల చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి.. వెంటనే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు జైపాల్‌యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.