ఆమనగల్లు, ఏప్రిల్ 24 : నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ మినీ ప్లీనరీ సమావేశానికి భారీగా కదలాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నియోజకవర్గంలోని 164 గ్రామ పంచాయతీ, రెండు మున్సిపాలిటీలలోని 37 వార్డుల్లో ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరణ చేయాలన్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆమనగల్లు పట్టణంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్లో నియోజకవర్గ స్థాయి పార్టీ మినీ ప్లీనరీ సమావేశంలో పాల్గొనాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలోని అన్ని వార్డుల నుంచి 20 మంది చొప్పున మొత్తం 4 వేల మంది ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారన్నారు. సమావేశానికి ముందు హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై గల దిమ్మె వద్ద బీఆర్ఎస్ పతాక ఆవిష్కరణ చేసి ర్యాలీగా చేరుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు అర్జున్‌రావు, పత్యానాయక్, మున్సిపాలిటీ నాయకులు చుక్క నిరంజన్, వెంకటయ్య, రామకృష్ణ, బాలస్వామి, వెంకటేశ్ పాల్గొన్నారు.
మినీ ప్లీనరీకి కార్యకర్తలు కదలాలి
ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నం రూరల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశానికి అధిక సంఖ్యలో కదలాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ మన్నెగూడ సమీపంలోని వేదా కన్వెన్షన్హాల్లో నిర్వహించే సమావేశానికి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. సకాలంలో హాజరై విజయవంతం చేయాలన్నారు.
తుర్కయాంజాల్ : మన్నెగూడ వేద కన్వెన్షన్హాల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సమావేశాన్ని విజయవంతం చేయాలని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు.
సమావేశాన్ని విజయవంతం చేయాలి
మంచాల : బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ నర్మద అన్నారు. సమావేశానికి ప్రతి ఊరు నుంచి తరలిరావాలని కోరారు.
చేవెళ్లటౌన్ : మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో నిర్వహించే బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సమావేశానికి తరలిరావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు. కేజీఆర్ గార్డెన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ రమణ, ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు.