వికారాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ శాసనసభ స్పీకర్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ మూడో స్పీకర్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో చేనేత, జౌళిశాఖల మంత్రిగా పనిచేశారు.
అయితే ఆయన మంత్రి పదవి ఆశించినప్పటికీ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆ పార్టీ అధిష్ఠానం ఆయన్ను స్పీకర్‌గా నియమించింది. శాసనసభ స్పీకర్‌గా ప్రసాద్‌కుమార్ నియమితులు కావడంతో వికారాబాద్‌లో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.