కేశంపేట, ఫిబ్రవరి 9 : గ్రామాల్లో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు పనులను గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధి పనుల నిర్వహణకు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించి స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం కాకునూరు మహాలింగేశ్వరస్వామి దేవాలయంలో దేవతల విగ్రహాల ప్రతిష్ఠ సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఎంపీపీ రవీందర్‌యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు పల్లె నర్సింగ్‌రావు, యాదగిరిరావు, విశ్వనాథం, పర్వత్‌రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.