కొత్తూరు, జూలై 3 : ప్రజలకు తాగునీరు అందించేందకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడలో నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ. 10 లక్షలతో నిర్మించిన వాటర్ ఫిల్టర్‌ను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో తాగునీటికోసం నియోజవర్గంలో అనేక అవస్థలు పడేవారని చెప్పారు. కానీ నేడు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఆడపడచుల నీటి బాధలు దూరం చేశారన్నారు. అయితే కుమ్మరిగూడ ప్రజలు తాగు నీటికోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వారికోసం ఫిల్టర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ సందర్భంగా ఫిల్టర్ మిషనరీ కోసం రూ. 2 లక్షలు డొనేట్ చేసిన 3వ వార్డు మెంబర్ కొస్గి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే అభినందించారు. అలాగే ఫిల్టర్ కోసం స్థలం ఇచ్చిన కుమ్మరి సంఘాన్ని, సహకరించిన మొదటి వార్డు టీఆర్స్ అధ్యక్షుడు ఆనంద్, శ్రీశైలం, కుమ్మరి ఆంజనేయులును ఆయన ప్రత్యేకంగా అభినందిచారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కొస్గి శ్రీనివాసులు, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌యాదవ్, యాదగిరి, బ్యాగరి యాదయ్య, రవినాయక్, జనార్దనచారి, ఏనుగు జనార్దన్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగగళ్ల శివకుమార్ పాల్గొన్నారు.