షాద్‌నగర్, నవంబర్ 8 : కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మితే మనం మోసపోయి, గోసపడక తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వై. అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొందుర్గు మండలం పాత ఆగిర్యాల తాండ, ఆగిర్యాల, లక్ష్మీదేవిపల్లి, పాత ఆగిర్యాల, ఎంకిర్యాల, ఎంకిర్యాలతండా, తిర్మన్దేవునిపల్లి, తంగేళ్లపల్లి, విశ్వనాథ్‌పూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ఎన్నికల హామీలను వివరించారు.
పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం తీవ్రంగా శ్రమించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కుర్చీల కొట్లాట తప్ప ప్రజల బాగుకోసం పనిచేసే నాయకులు లేరని ఎద్దేవా చేశారు. మన ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని గుర్తించాలని, పనులు చేసే నాయకుడిని గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో వంకాయల నారాయణరెడ్డి, రాజేశ్ పటేల్, దామోదర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రాంచంద్రయ్య, కృష్ణయ్య, రామకృష్ణ, రాంబాల్‌నాయక్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : ప్రజలకు అండ.. బీఆర్ఎస్ జెండా అని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. మున్సిపాలిటీలోని వార్డుల్లో కౌన్సిలర్లు జీ.టీ శ్రీనివాస్, అంతయ్య, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. షాద్‌నగర్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను గెలిపించాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ర్టాభివృద్ధి, సకల జనులకు పథకాలు అందించాలనే సంకల్పం తో సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీని నమ్మితే మోసపోతామని ప్రజలు గ్రహించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జూపల్లి శంకర్, సుధాకర్, శేఖర్, నందకిశోర్, శ్రీనివాస్, రాఘవేందర్‌రెడ్డి, అశోక్ పాల్గొన్నారు.
నందిగామ: షాద్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా నందిగామ మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూనే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.
షాద్‌నగర్‌రూరల్ : ఎమ్మెల్యే అభ్యర్థిఅంజయ్యయాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఫరూఖ్‌నగర్ మండలంలోని బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు.
కొత్తూరు : బీఆర్ఎస్ గెలుపుతోనే కొత్తూరు ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్‌యాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గోవింద్‌రెడ్డి, జంగగళ్ల శివకుమార్, రవినాయక్, వెంకటేశ్, ఆంజనేయులుగౌడ్, రాఘవేందర్‌యాదవ్, బాలు, లక్ష్మయ్య, శ్రీనివాస్‌చారి, విష్ణు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
శంకర్పల్లి : అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొండకల్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, ఎంపీటీసీలు సురేందర్‌రెడ్డి, యాదగిరి, సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మద్ది ప్రశాంత్, భూపాల్ పాల్గొన్నారు.
మొయినాబాద్ : రెడ్డిపల్లి, మోత్కుపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాద య్య గెలుపు ఖాయమని ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి అన్నారు. మండల కేంద్రంలో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు శివారెడ్డి, నర్సింహులు, నాయకులు రామేశ్వర్ రెడ్డి, శేరి పెంటారెడ్డి, సాయినాథ్, మహేందర్‌రెడ్డి, శంకర్, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.