కులవృత్తులకు చేయూత
తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు చేయూతనిస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చేవెళ్ల పట్టణం, తాండూరులలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాలను గురువారం ఆయన ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రోహిత్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
- సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి
- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- చేవెళ్ల, తాండూరులలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాల ఆవిష్కరణ
తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు చేయూతనిస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చేవెళ్ల పట్టణం, తాండూరులలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాలను గురువారం ఆయన ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రోహిత్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్నగౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలన్నారు. సీఎంor కేసీఆర్ కులవృత్తులకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఒకటి కూడా పెట్టలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు బాగుపడుతున్నాయన్నారు.
-చేవెళ్ల టౌన్, ఆగస్టు 17
చేవెళ్లటౌన్, ఆగస్టు 17 : తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు చేయూతనిస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం చేవెళ్ల మం డల కేం ద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్నగౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తున్నదన్నారు. స్వరాష్ట్రంలో వీరుల చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలనే తపనతో సీఎం కేసీఆర్ ఖిలాషాపూర్‌లోని పాప న్న కోట అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేశారు. గౌడ కులస్తులకు అండగా మన సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. సర్దార్ సర్వాయి పాప న్న జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాకుం డా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహ ఏర్పాటుకు ప్రత్యేక జీవోను జారీ చేసిందన్నారు. ఆ రోజుల్లోనే జనగామ దగ్గర 25 గొలుసు కట్టు చెరువులను తవ్వించి అద్భుత పాలన సాగించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.

ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు పొందిన ధీరుడని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో కులవృత్తులకు పూర్వవైభవం వస్తున్నదన్నారు. బడుగు, బలహీన వర్గాల వారు బాగా చదువుకోవాలని ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. అన్ని కులాలను గౌరవిస్తున్న కులం గౌడ కులమని అన్నారు. హైదరాబాద్‌లో రూ.కోట్ల విలువైన భూములను కులవృత్తుల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించడంతోపాటు భూమి పూజ కూడా చేయడం జరిగిందన్నారు. అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఒక టి కూడా పెట్టలేదని..కానీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ఆవిష్కరించడంతోపాటు అధికారికంగా ఆయన జయంతి, వర్ధంతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గౌడ కులస్తుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ వీరత్వానికి ప్రతీక సర్వా యి పాపన్నగౌడ్ అని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌రావుగౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రశాంత్‌గౌడ్, నాగేందర్‌గౌడ్, ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెంకటరంగారెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, గౌడ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కులవృత్తులకు పూర్వవైభవం..
తాండూరు : కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం ఆయన తాండూరులోని సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మ న్ రాజూగౌడ్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న అందరివాడని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎం తో కృషి చేశారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మహనీయుల జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించడం నిజమైన నివాళులని.. అందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందన్నారు. తాండూరు పక్కనే ఉన్న కర్ణాటకలో కష్టాలు ఉంటే ఇక్కడ మాత్రం ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. తాండూరులో త్వరలో ఎక్సైజ్ శా ఖ ఠాణాను ఏర్పాటు చేయడంతోపాటు క్రీడా మైదానాన్ని నిర్మిస్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రానున్న ఎన్నికల్లో రోహిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రజల బాగుకోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న అని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. ప్రభు త్వం కల్లుగీత కార్మికులకు రూ.5 లక్షల బీమా, వయోధిక కల్లు గీత కార్మికులకు నెలకు రూ.2016 పింఛన్ ఇస్తున్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీశైల్‌రెడ్డి, గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

