‘బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థుల విజయం ఖాయమని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు ఉనికి కోసమే ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ హ్యాట్రిక్ సీఎం కేసీఆర్…చేవెళ్లకు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కాలె యాదయ్య విజయం ఖాయమన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని, మళ్లీ ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
– షాబాద్/చేవెళ్ల టౌన్, అక్టోబర్ 20
షాబాద్/చేవెళ్ల టౌన్, అక్టోబర్ 20 : కాంగ్రెస్, బీజేపీలు ఉనికి కోసమే ప్రజలను మభ్యపెడుతున్నాయని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి అసెంబ్లీ ఇన్చార్జి, ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రి హాజరయ్యారు. అనంతరం చేవెళ్ల నియోజకవర్గంలో నవంబ ర్ 30న జరుగనున్న ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ ఇచ్చిన మండలానికి రూ.5లక్షలు సొంతంగా ఇస్తున్నట్లు చేవెళ్ల మాజీ ఎం పీపీ మంగళి బాల్‌రాజ్ చెక్కును మంత్రికి అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధిక మెజా ర్టీ చేవెళ్ల నియోజకవర్గంలో వస్తుందన్నారు. మీ అందరి సహకారంతో యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని సూ చించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని కొనియాడారు. ఇంటింటికీ అందుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా రాష్ర్టాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలిపిందన్నారు. తాను మొదటిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి కేటీఆర్ సహకారంతో షాబాద్ మండలానికి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకొచ్చినట్లు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీల ఏర్పాటుతో షా బాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసిందన్నారు. వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించిందన్నారు. దళితబంధు, బీసీబంధు, రైతుబంధు, ఆసరా పింఛన్లు తదితర పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటున్నదన్నారు.
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నదని మం త్రి మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ పథకాలను ముందుగా కర్ణాటక రాష్ట్రంలో అమలు చేసి చూపాలని ఎద్దేవా చేశారు. ఆరు పథకాలు ఉత్తవేనని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. ఇచ్చేది లేదన్నా రు. బీజేపీ, కాంగ్రెస్‌లు బీఆర్ఎస్కు పోటీయే కాదని ఆయన స్పష్టం చేశారు. ఉనికి కోసమే ఈ రెండు పార్టీలు ఆరాటపడు తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నా రు. ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉందని ..కాంగ్రెస్, బీజేపీలకు లేదన్నారు. నిన్న, మొన్న రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు తెలంగాణలో పర్యటించి సీఎం కేసీఆర్ కుటుంబంపై ఏదేదో మాట్లాడారని మండిపడ్డారు. వారు కాంగ్రెస్ ఉనికి కోసం రాష్ట్రంలో తిరుగుతున్నారని, ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఆ పార్టీ అధికారంలోకి రాదన్నారు.
ప్రజలంతా ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. కార్యక్రమంలో డీసీఏంఎస్ పట్లోళ్ళ కృష్ణారెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీలు మర్పల్లి మాల తి, పట్నం అవినాశ్‌రెడ్డి, కాలె శ్రీకాంత్, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, వైస్ ఎంపీపీలు కర్నె శివప్రసాద్, మమత, బీఆర్ఎస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్‌రావు, మహేందర్‌రెడ్డి, నాగిరెడ్డి, గోపాల్, వాసుదేవ్‌కన్నా, మాజీ ఎంపీపీ మంగళి బాల్‌రాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు నర్సింగ్‌రావు, పాపారావు, ప్రశాంత్‌గౌడ్, పీఏసీఏస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, గోవర్ధ్దన్‌రెడ్డి, వెంకటేశంగుప్తా, దర్శన్, మల్లేశ్, రాంచంద్రారెడ్డి, శేఖర్, నర్సింహులు, మల్లేశ్, రామగౌడ్, మోహన్‌రెడ్డి, శివారెడ్డి, నరహరిరెడ్డి, శంకరయ్య, జంగారెడ్డి, మునీర్, నర్సింహారెడ్డి, రవీందర్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడు తూ .. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి గా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారు. మూడేండ్లలోనే కాళేశ్వరాన్ని పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియా డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయని త్వరలోనే మిగిలిన పనులను కూడా పూర్తి చేసి ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలోని అని నియోజకవర్గాలకు సాగునీరు అం దించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడంతో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో విడుదల చేశారన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు పాలించే రాష్ర్టాల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసి ఇక్కడ మాట్లాడాలని సూచించారు. మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజలందరూ కేసీఆర్‌కు అండగా నిలవాలని, తనను మూడోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జి, ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ హ్యాట్రిక్ సీఎం కేసీఆర్…చేవెళ్లకు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కాలె యాదయ్య గెలుస్తారని స్పష్టం చేశారు. అన్ని మండలాలు, గ్రామాలు, బూత్‌లలో పోటీ పెట్టుకుని కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఒక్కరి కడుపునిండా, గుండెలనిండా కారు గుర్తే ఉండాలి…గులాబీ జెండా ఉండాలి…కేసీఆర్ ఉండాలి…కాలె యాదయ్య ఉండాలని పిలుపునిచ్చారు. మన బలమంతా మనం చేసిన అభివృద్ధి, సంక్షేమమేమన్నారు. నెల రోజులు పార్టీ కోసం అందరం కష్టపడి పనిచేస్తే, రానున్న ఐదేండ్లు ఎమ్మెల్యే మన కోసం అభివృద్ధి చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లాగా పిచ్చి మాటలు, బీజేపీ వారిలా మతతత్వ మాటలు మాట్లాడమని చెప్పారు.
రాహుల్‌గాంధీ వచ్చి ఏదేదో మాట్లాడారని, వాళ్ల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు బదులుగా రాహుల్‌గాంధీ ఎందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ 14 ఏండ్ల పోరాటాల ఫలితంగా రాష్ట్రం ఏర్పాటైందని…బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. మనమంతా కేసీఆర్‌కు చేయూతనిచ్చి కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. తెలంగాణ వచ్చిన తర్వాతే 24 గంటల కరెంట్ వస్తున్నదని, ఇంటింటికీ తాగునీరు అందుతుందని, రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న ఘనత మన సీఎంకే దక్కిందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను ప్రకటించారన్నా రు. దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్‌వన్ స్థానంలో ఉన్నదని, మంత్రి కేటీఆర్ కృషితో పరిశ్రమల ఖిల్లాగా రంగారెడ్డిజిల్లా అవతరించిందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఉత్తమాటలేనని, ఆరు నూరైనా గులాబీ జెండా రంగారెడ్డి జిల్లా లో క్లీన్‌స్వీప్ చేస్తుందన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వచ్చిన మండలానికి రూ.50 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించారు.