కొడంగల్, నవంబర్ 15 : రేవంత్ ఓ ఫ్యాక్షనిస్టు.. గూండాయిజాన్ని ప్రోత్సహిస్తూ నియోజకవర్గంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు యత్నిస్తున్నాడని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం కోస్గి మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడు తూ.. మంగళవారం రాత్రి కోస్గి మండల కేంద్రం లోని సర్జఖాన్‌పేట, కోస్గి మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులపై జరిగిన దాడిని ఖండించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను భయపెట్టి అడ్డదారిలో గెలిచేందుకు రేవంత్ పథకం పన్నాడని..గతంలో రెండుసార్లు కూడా ఇదేవిధంగా పథకం ప్రకారం దాడులకు పాల్పడి గెలిచిన ఘటనలు ప్రజలకు గుర్తున్నదన్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా
నెరవేరవన్నారు. ఎవరి ద్వారా సెగ్మెంట్ అభివృద్ధిలో వెనుకబడిందో.. ఎవరి వల్ల శాంతిభద్రతలకు భంగం కలుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని ఈనెల 30న జరుగనున్న పోలింగ్‌లో వారికి సరైన జవాబు చెబుతారన్నారు. గత ఐదేండ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముం దుకు తీసుకెళ్లారన్నారు. వేల కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులతోపాటు.. మౌలిక వసతులను కల్పించినట్లు తెలిపారు. నరేందర్‌రెడ్డి హ యాంలో సెగ్మెంట్లో సుఖశాంతులు నెలకొన్నాయని.. ఫ్యాక్షనిస్టు రేవంత్వస్తే ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్నారు. ఖబడ్దార్ రేవంత్‌రెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోసారి మా పార్టీ నా యక్తులపై దాడులు పునరావృతమైతే మాసత్తా ఏమిటో చూపించాల్సి వస్తుందన్నారు.
సర్జికల్ దాడి అనేది దేశాల మధ్య జరిగే యుద్ధమని.. కానీ, మంగళవారం రాత్రి కోస్గి పట్టణం లో జరిగిన ఘటన సర్జికల్ దాడిని తలపించేలా ఉందని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ అన్నారు. శాంతియుతంగా సర్జఖాన్‌పేటలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసుకుంటుంటే కాంగ్రెస్ గూండాలు ఎక్కడినుంచో వచ్చి బీఆర్ఎస్ నాయకులు వారి వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడికి దిగడంపై మండిపడ్డారు. ఇటువంటి ఘటనలను చూస్తే.. రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టమవుతున్నదన్నారు. దాడి ఘటనపై ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మళ్లీ రాళ్లు, కర్రలతో దాడి చేసి గా యపర్చడం సరైంది కాదన్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నట్లు కనిపిస్తున్నదన్నారు. ఈ ఎన్నికల్లో నూ పట్నం నరేందర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రా మకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రావు యాదవ్, రాజేశ్, ప్రతాప్ పాల్గొన్నారు.
ఎన్నికల్లో అన్ని పార్టీల వారు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసుకోవచ్చు. కానీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడ ప్రచారం చేసినా అక్కడ అడ్డుకుంటున్నారు. అడ్డుకోవడమే కాకుండా రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడడం చాలా బాధాకరం. రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాతే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రజలను భయపెట్టేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి.
-లక్ష్మణ్, ఎమ్మెల్యే డ్రైవర్
కోస్గి మండలంలోని సర్జఖాన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ గూండాలు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాడికి నిరసనగా రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేయగా ఒక్కసారిగా కాంగ్రెస్ వర్గీయులు మళ్లీ రాళ్లదాడికి దిగారు. కాంగ్రెస్ వర్గీయులు ముందస్తు పథకం ప్రకారమే దాడి చేసినట్లుగా అనిపిస్తున్నది.
– కొండ్రు విజయ్‌కుమార్, 16వ వార్డు, కోస్గి