మొయినాబాద్, నవంబర్15 : మొయినాబాద్‌కు నేడు మంత్రి కేటీఆర్ రానున్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మద్దతుగా నిర్వహించనున్న రోడ్డు షోలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు మొయినాబాద్‌కు చేరుకోనుండగా.. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై రోడ్‌షో జరుగనున్నది.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు. రోడ్‌షోకు సంబంధించి పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.