ఇప్పటికే పారిశ్రామికహబ్‌గా పేరొందిన రంగారెడ్డి జిల్లాలో మరో రెండు కంపెనీలు కొలువుదీరుతున్నాయి. షాబాద్ మండలం చందనవెల్లిలో రూ.576కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న జపాన్‌కు చెందిన దైఫుకు, నికోమాక్ తైకిష కంపెనీలకు శుక్రవారం రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో చందనవెల్లిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు. ఈ రెండు కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసం కంపెనీలు స్థానికంగా ఉన్న ఐటీఐను దత్తత తీసుకుని నైపుణ్య శిక్షణను కూడా ఇస్తాయని తెలిపారు. పారిశ్రామిక రంగంలో భవిష్యత్ మనదేననన్నారు. మంత్రి పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. అంతకుముందు మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
జిల్లాలోని చందనవెల్లిలో జపాన్‌కు చెందిన దైఫుకు, నికోమాక్ తైకిష కంపెనీలకు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమం కోలాహలంగా సాగింది. శుక్రవారం ఒక్క రోజే రూ. 576 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న రెండు కంపెనీలకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ రెండు కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కనున్నట్లు ప్రకటించారు. స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకుని నైపుణ్య శిక్షణను కూడా ఇప్పిస్తామన్నారు. అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెడుతుండడంతో తెలంగాణకే తలమానికంగా చందనవెల్లి పారిశ్రామికవాడ మారుతున్నదని.. భవిష్యత్తు మనదేనన్నా రు. ఉద్యోగాల కల్పనపై కేటీఆర్ చేసిన ప్రకటన స్థానికుల్లో సంతోషాన్ని నింపింది.
రంగారెడ్డి, జూలై 14 (నమస్తే తెలంగాణ): ఉదయం 11 గంటలకు మంత్రి కేటీఆర్ చందనవెల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి భూమి పూజ నిర్వహించాల్సిన కంపెనీ ప్రాంతానికి వెళ్లారు. రూ. 126 కోట్ల పెట్టుబడులతో 10 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నికోమాక్ తైకిష క్లీన్ రూమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంతానికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా జపాన్ కంపెనీకి చెందిన ప్రతినిధులు మంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అక్కడ భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తయ్యాక పక్కనే 32.86 ఎకరాల్లో రూ.450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న దైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీల ఉత్పత్తులకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి తిలకించారు. చందనవెల్లి ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు కల్పించే విషయమై పారిశ్రామిక వేత్తలతో చర్చించారు. గంటపాటు సాగిన కేటీఆర్ పర్యటన చందనవెల్లి ప్రాంతంలో పండుగ వాతావరణాన్ని తలపించింది. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, దైఫుకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, నికోమాక్ తైకిష కంపెనీ ఎండి తకుయ మోరిసన్, కౌన్సిల్ జనరల్ మసయుకి ,దైఫుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నావ్యుకి పాల్గొన్నారు.
చందనవెల్లిలో 103 కంపెనీలకు ప్లాట్ల కేటాయింపు
చందనవెల్లిలో ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి కోసం ప్రభుత్వం 2,060.34 ఎకరాలను కేటాయించగా అందులో 1,569.89 ఎకరాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు టీఎస్ఐఐసీ లే అవు ట్ చేసి 799 ఎకరా ల్లో 194 ప్లాట్లు చేసి విడుతల వారీగా కంపెనీలకు ప్లాట్లను కేటాయిస్తున్నది. తాజాగా దైఫుకు, నికోమాక్ తైకిష కంపెనీలకు కూడా ప్లాట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో చందనవెల్లి ఇండస్ట్రియల్ పార్కులో ఇప్పటివరకు 103 కంపెనీలకు ప్లాట్లను కేటాయించినైట్లెంది.
సంతోషాన్ని నింపిన ఉద్యోగాల ప్రకటన..
జపాన్ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రెండు కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కుతాయని, ఈ మేరకు ఆయా కంపెనీలు తనకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకుని ఉద్యోగుల నైపుణ్యానికి సంబంధించి శిక్షణను కూడా ఆ కంపెనీలు ఇస్తాయని చెప్పారు. రూ.576 కోట్ల పెట్టుబడులతో వచ్చే ఏడాది సెప్టెంబర్ నా టికి అందుబాటులోకి వచ్చే ఈ రెండు కంపెనీలతో ప్రత్యక్షంగా 1600 నుంచి 2000 మందికి ఉపాధి కలుగుతుందని.. పరోక్షంగా కలిగే ఉపా ధి ఇంతకు రెట్టింపేనని పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన ఈ ప్రకటన స్థానికుల్లో సంతోషాన్ని నిం పింది. చందనవెల్లి ప్రాంత అభివృద్ధ్దికి సంబంధించి పలు విషయాలను ఈ సందర్భంగా మం త్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతోనే చందనవెల్లికి కంపెనీలు వెల్లువలా వస్తున్నాయని అన్నారు. వెల్స్పన్, ఆమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద, పెద్ద కంపెనీలు చందనవెల్లిలోనే ఏర్పాటైనట్లు గుర్తు చేశారు. టెక్స్టైల్స్ మొదలుకుని ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అనేక కంపెనీలు చందనవెల్లినే ఎంచుకుంటున్నాయని, అంతర్జాతీయంగా పేరుగాంచిన కంపెనీలు కూడా ఈ ప్రాంతంలోనే పెట్టుబడులు పెట్టేందు కు ఆసక్తి చూపుతున్నాయన్నారు. రాష్ర్టానికే తలమానికంగా చందనవెల్లి పారిశ్రామికవాడ ఎదుగుతుందని పేర్కొన్న మంత్రి.. జపాన్ కంపెనీలు చందనవెల్లిలో క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తే సర్కారు సహకరిస్తుందన్నారు.
మంత్రికి షాబాద్‌లో ఘన స్వాగతం
మండలంలోని చందనవెల్లిలో జపాన్‌కు చెందిన దైఫుకు, నికోమాక్ తైకిష కంపెనీలకు శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు షాబాద్‌లో జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ పర్యటనతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, కాలె శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువనాయకుడు పట్లోళ్ళ కార్త్తిక్రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, షాబాద్ ఎంపీడీవో అనురాధ, తహసీల్దార్ మ ధు, విద్యుత్తు శాఖ ఏఈ నరేందర్, ఆయా గ్రామాల సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, మల్లేశ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, డైరెక్టర్ యాదయ్య, మం డల యువజన విభాగం అధ్యక్షుడు సతీశ్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, పార్టీ నాయకులు దర్శన్, రాజూగౌడ్, భూపా ల్‌రెడ్డి, సురేశ్‌గౌడ్, రమేశ్‌యాదవ్, శివకుమార్, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మల్లేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.