ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానను వందపడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో గురువారం ఆయన మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. రూ72.21 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, అభయహస్తం, వడ్డీలేని రుణాలు వంటి పథకాలతో మహిళల ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మహేశ్వరానికి మంజూరైన మెడికల్ కాలేజీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, దీనికి అనుబంధంగా 650 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను అందుబాటులోకి తెస్తామన్నారు. జిల్లాలోని 89వేల మంది లబ్ధిదారులకు రెండుమూడు రోజుల్లో అభయహస్తం నిధులను విడుదల చేస్తామన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, మరోసారి బీఆర్ఎస్ను ఆదరించి అభివృద్ధిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ స్వరాష్ర్టానికి ముందు, తరువాత జరిగిన అభివృద్ధి, ప్రజల జీవితాల్లో మారిన స్థితిగతులను బేరీజు వేసుకొని ఓటు వేయాలన్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. పారిశ్రామిక ప్రగతితో స్థానికంగా ఉద్యోగావకాశాలు మెరుగుపడ్డాయన్నారు.
-రంగారెడ్డి, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సంక్షేమ పథకాల్లో మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో గురువారం మంత్రి హరీశ్‌రావు సుడిగాలి పర్యటన చేశారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలతో కలిసి ఈ రెండు నియోజకవర్గాల్లో రూ.72.21 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభ ల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. మహిళలకోసం కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, ఆరోగ్యలక్ష్మి, అమ్మఒడి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలను ప్రభు త్వం అమలు చేస్తున్నదన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మహిళల నీటి కష్టాలను పరిష్కరించలేదని.. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో నీటి ఎద్దడిని తీర్చారన్నారు. వడ్డీలేని రుణాలు, అభయహస్తం, బ్యాంకు లింకేజీ రుణాలను పెంచి మహిళల సాధికారతకు ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. ఇండ్ల పట్టాలు, గృహలక్ష్మి ప థకం మంజూరు పత్రాలనూ మహిళల పేరునే ఉత్తర్వులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్డీ వో, తహసీల్దార్ కార్యాలయ భవనాలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఈనాడు ఎండీ కిరణ్, రామో జీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు.
మంత్రి, ఎమ్మెల్యేపై ప్రశంసలు
నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా రని మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిలపై మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు కురిపించారు. ఆడబిడ్డల కోసం మా సబితక్క అడిగిందంటూ.. మహిళలకు వరాలు ప్రకటించిన సందర్భంలో సభలో కరతాళ ధ్వనులు ప్రతిధ్వనించాయి. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ మంచి జరుగాలని కిషన్‌రెడ్డిలో కనిపిస్తుందని కొనియాడారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేసే వారికి అండగా ఉండి ఆదరించాలని ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు సూ చించారు. ఎన్నికలప్పుడే సూట్ కేసుల్లో నాలుగైదు డ్రస్సులు పెట్టుకుని వచ్చే నేతల మాయలో పడొద్దని మంత్రి హితబోధ చేశారు. ప్రతిపక్షాల తీరు ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడ మల్లన్న లాగా ఉంటున్నదని ఎద్దేవా చేశారు.
రూ.72.21 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లా ప్రగతిపథంలో ముందుకు దూసుకుపోతున్నదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం ఆయన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకజవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసి రూ. 72.21 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తొలుత రూ.2 కోట్లతో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత లష్కర్‌గూడ వద్ద ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రూ.5.50 కోట్ల తో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడలో హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో నిర్మించిన ఓహెచ్‌ఎస్‌ఆర్‌ను ప్రారంభించారు. ఇదే మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ వద్ద రూ.3కోట్లతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బార్కాస్ నుంచి వయా నాదర్గుల్ రోడ్డు మీదుగా హైదరాబాద్-సాగర్ రోడ్డు వరకు ఆర్అండ్బీఆధ్వర్యంలో రూ.16 కోట్ల తో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు తుర్కయాంజాల్ ఎక్స్ రోడ్డు వద్ద ప్రారంభోత్సవంతోపాటు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శారిగూడలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన బస్తీ దవాఖానను ప్రారంభించారు.
ఇబ్రహీంపట్నం నుంచి బీడీఎల్, ఇండస్ట్రియల్ పార్కు వరకు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో రూ.13.86 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో రూ.4.20 కోట్లతో నిర్మించిన టీటీడబ్ల్ల్యూఆర్ఈఐఎస్ బాలుర పాఠశాల భవనానికి, రూ. 2.15కోట్లతో నిర్మించిన కాలేజ్ హాస్టల్ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో రూ.5కోట్లతో టీటీడబ్ల్ల్యూ బాలుర వసతి గృహంలో నిర్మించనున్న డార్మటరీకి శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రూ.5కోట్లతో చేపట్టనున్న టీయూఎఫ్ఐడీసీ పనులకు శంకుస్థాపన చేశారు. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.2కోట్లతో నిర్మించిన నూతన ఆర్డీవో కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన తర్వాత డీఎంఎఫ్టీ ఆధ్వర్యంలో యాచారంలో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ దవాఖానకు శంకుస్థాపన చేశారు. చివరగా రూ.4కోట్లతో మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించారు. మ ధ్యాహ్నం 12 గంటలకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన మం త్రి హరీశ్‌రా వు సాయంత్రం వరకు ఇబ్రహీంపట్నంతోపాటు, మహేశ్వరం నియోజకవర్గాల్లో అలుపెరగకుండా పర్యటించారు. ప్రజలు ఆశ్చర్యపోయేలా ఓపికగా, ఉత్సాహం గా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.
జిల్లాపై వరాల జల్లు..
మంత్రి హరీశ్‌రావు జిల్లాపై వరాల జల్లు కురిపించారు. మహేశ్వరానికి మం జూరైన మెడికల్ కాలేజీకి త్వరలోనే శంకుస్థాపన చేయడంతోపాటు అనుబంధంగా 650 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ దవాఖానను అప్‌గ్రేడ్ చేస్తూ వారం రోజుల్లోనే ఉత్తర్వులూ జారీ చేస్తామన్నారు. దాదాపు రూ. 30 కోట్ల వరకు నిధులను విడుదల చేసి డయాలసిస్, ఐసీయూ వంటి అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పిస్తామన్నారు. కరోనా కారణంగా జిల్లాలోని 89వేల మం ది లబ్ధిదారులకు నిలిచిపోయిన అభయహస్తం నిధులను రెండు, మూడు రోజుల్లోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్న వీఏవో, ఆర్పీల వేతనాల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను వారం రోజుల్లో జారీ చేస్తామన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు సెర్ప్ నుంచి రూ.63 లక్షల చెక్కును అందజేసిన మం త్రి..త్వరలోనే వడ్డీ లేని రుణాలనూ అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, క్యామ మల్లేశ్, గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్‌చైర్మన్ సత్తయ్య, ఎంపీపీలు కృపేశ్, నర్మద, రేఖ, సుక న్య, జడ్పీటీసీ జంగమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, మున్సిపల్ చైర్పర్సన్లు స్రవంతి, అనురాధ, స్వప్న, వైస్‌చైర్మన్ యాదగిరి, కళమ్మ, హరిత, ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, జంగయ్య, మండల పార్టీ అధ్యక్షులు బుగ్గరాములు, రమేశ్‌గౌడ్, కిషన్‌గౌడ్, బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రాజు, జగదీశ్వర్, కృష్ణగౌడ్, రాంరెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు.
ప్రజల బాగుకోసం పరితపిస్తున్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం : నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల బాగు కోసం నిరంతరం పరితపిస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని రానున్న ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలోనే ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ఎంతగానో కృషిచేస్తున్నారన్నారు. కొంతమంది నాయకులు ఎన్నికలప్పుడే ప్రజల ముందుకొస్తున్నారని…అవి కాగానే కనిపించకుండా పోతున్నారని అన్నారు. కానీ.. కిషన్‌రెడ్డి మాత్రం నియోజకవర్గాభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే వారు కావాలా.. ఎన్నికలప్పుడే వచ్చిపోయే వారు కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.
సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో ప్రగతి సాధించారన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. తెలంగాణ రాక ముందు తాగునీటి కోసం అనేక ఇబ్బంది పడ్డామని..రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ‘మిషన్ భగీరథ’తో ఇం టింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నారని కొనియాడారు. ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటుతో జిల్లాలోని మరింత మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. అభయహస్తం కింద జిల్లాలోని మహిళలకు చెల్లించాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు.
ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటుతో మరిన్ని ఉద్యోగావకాశాలు
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నీటితో నిండేందుకు మంత్రి హరీశ్‌రావు తీసుకున్న చర్యలే కారణం. నాలుగేండ్ల క్రితం మం త్రి ఇబ్రహీంపట్నంలో పర్యటించిన సందర్భంగా ఎండిపోయిన ఇబ్రహీంపట్నం చెరువు పరిస్థితిని వివరించగా వెంటనే చెరువు మరమ్మతులకు రూ.16 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో చెరువుకు నీరందించే కాలువలు, నాలాకు మరమ్మతులు చేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వాటి ద్వారా చెరువులోకి పెద్ద ఎత్తున నీరు చేరి నిండుకుండలా మారింది. ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగావకాశాలు మరింత పెరుగుతాయన్నారు.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే