రంగారెడ్డి, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): ‘పట్టుబట్టి సబితక్క మెడికల్ కాలేజీని సాధించింది.. మీర్ఖాన్పేట్లో నిర్మాణం జరిగే మెడికల్ కాలేజీని ఏడాది కాలంలో అందుబాటులోకి తెస్తాం..’ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్ ఫార్మాసిటీ సమీపంలో 300ఎకరాల్లో నిర్మించనున్న మెడికల్ కళాశాలకు మంత్రి సబితారెడ్డితో కలిసి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఆమనగల్లులోనూ పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మీర్ఖాన్పేట్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. రూ.176కోట్లతో మీర్ఖాన్పేట్లో మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నామని, మరో రూ.300 కోట్లతో 450 పడకలతో ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నామన్నారు. ఏ రోగ మొచ్చినా, నొప్పి వచ్చినా ఉస్మానియా ఆసుపత్రికి పోతున్నారని, బిడ్డ కాన్పుకు కోఠి దవాఖానకు వెళ్తున్నారని, ఇక మెడికల్ కాలేజీ అందుబాటులోకి వచ్చాక ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. 150 మంది డాక్టర్లతో నిరంతరం ప్రజలకు సేవలందనున్నాయని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లను త్వరలోనే కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పారించి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. గత నెల మహేశ్వరానికి వెళ్లినప్పుడు ప్రజల్లో విశేష స్పందనను చూశానని, ప్రస్తుతం కందుకూరులోనూ అదే స్పందన కనబడుతున్నదని, సబితక్క లక్ష పైచిలుకు మెజార్టీతో గెలువడం ఖాయమన్న నమ్మకం ఉన్నదని పేర్కొన్నారు.
మెడికల్ కళాశాల మహేశ్వరం నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన బహుమానం. కందుకూరు మండలానికి ఇది ఓ వరమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్లో మెడికల్ కళాశాల నిర్మాణ పనులకు మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జల్పల్లి, ఆమనగల్లు మున్సిపాలిటీల్లోనూ పలు అ భివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మీర్ఖాన్పేట్లో జరిగిన బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పట్టుబట్టి సబితక్క మెడికల్ కాలేజీని సాధించారని.. ఏడాదిలోనే దీనిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈసారి లక్షా పైచిలుకు ఓట్లతో సబితక్క గెలవడం ఖాయమన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథ కం నీళ్లను కూడా త్వరలోనే కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పారించి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు.
లక్ష పై చిలుకు మెజార్టీతో గెలవడం ఖాయం
లక్ష ఓట్ల మెజార్టీతో మంత్రి సబితాఇంద్రారెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుందన్న ఎంపీ రంజిత్‌రెడ్డి వ్యాఖ్యలను మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా ప్రస్తావించారు. లక్ష పై చిలుకు మెజార్టీతో సబితక్క గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ్‌కాలనీలో పర్యటించినప్పుడు ప్రజల నుంచి అపూర్వ స్పం దన వచ్చిందన్నారు. గత నెలలో మహేశ్వరానికి వెళ్లినప్పు డు కూడా అక్కడి ప్రజల్లో విశేష స్పందనను చూశానని, ప్రస్తుతం కందుకూరులోనూ అదే స్పందన కనబడుతున్నదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో ఇంద్రన్న అభివృద్ధి కోసం ఎంతలా కృషి చేశారో..ఇప్పుడు సబితక్క కూడా అంతే పట్టుదలతో కృషిచేస్తున్నదని కొనియాడారు.
త్వరలోనే ఎత్తిపోతల నీటిని అందిస్తాం..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా త్వరలోనే కృష్ణానీటిని ఈ ప్రాంతంలో పారించి ప్రజల రుణం తీర్చుకుంటామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించారని, కాలువలకోసం టెండర్లను కూడా పిలిచారన్నారు. కృష్ణా నీళ్లు వస్తే కాలం అయినా కాకపోయినా మహేశ్వరం, కందుకూ రు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో రెండు పంటలు పండుతాయని, ఆ రోజు..దగ్గరలోనే ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయన్నారు. తక్కుగూడ ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, 50 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించేలా ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి జరుగుతున్నదన్నారు. ఓ వైపు వ్యవసాయం, మరోవైపు పరిశ్రమల రంగం అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఇంకోవైపు సంక్షేమ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. కేంద్రం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని.. కాంగ్రెస్ మాయమాటలు నమ్మితే మూడు గంటల కరెంటుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
సభ సూపర్ సక్సెస్..
మెడికల్ కళాశాల శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన బహిరంగసభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఊహించిన దా నికంటే పెద్ద సంఖ్యలో మహేశ్వరం నలుమూలల నుంచి అన్నివర్గాల ప్రజలు సభకు తరలివచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కార్త్తిక్రెడ్డి, జడ్పీటీసీ జంగారె డ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, డిప్యూటీ మేయ ర్ తీగల విక్రమ్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ బడంగ్‌పేట అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జయేందర్‌ముదిరాజ్, సర్పంచ్ జ్యోతి, నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, దశరథ్, అరవింద్‌శర్మ, కామేశ్‌రెడ్డి, నగేశ్, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మాదేవేందర్, కార్తిక్, విఘ్నేశ్వర్‌రెడ్డి, దీక్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇకపై హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదు..
సబితక్క సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ఒప్పించి టీఎస్ఐఐసీ నుంచి స్థలాన్ని తీసుకోవడమే కాకుండా ఆరోగ్యశాఖను సైతం ఒప్పించి మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీని మంజూరు చేయించుకున్నారని మం త్రి హరీశ్‌రావు ప్రశంసించారు. ఏ రోగ మొచ్చినా, నొప్పి వచ్చినా ఉస్మానియా, బిడ్డ కాన్పునకు కోఠి దవాఖానలకు వెళ్తున్నారు. మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తే ఆ రెండు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నా రు. రూ.176 కోట్లతో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశామని, మరో రూ.300 కోట్లతో 450 పడకలతో దవాఖాననూ నిర్మించి ఏడాదిలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఆస్పత్రిలో 150 మంది డాక్టర్లు నిరంతరంగా సేవలందిస్తారన్నారు. మెడికల్ కాలేజీతో ఈ ప్రాం తవాసులకు వైద్య విద్యతోపాటు మంచి వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ రాక ముం దు రెండే మెడికల్ కాలేజీలుండేవని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు.
గత ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు
గత ఉమ్మడి ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వా తే వారికి మంచిరోజులొచ్చాయి. గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వ దవాఖానలను ఏర్పాటు చేసి వైద్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లారు. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తైతే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. కార్పొరేట్ దవాఖాన మాదిరిగా ఇక్కడ వసతు
లుంటాయి. -అనితాహరినాథ్‌రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్
‘పాలమూరు- రంగారెడ్డి’కి జాతీయ హోదా కల్పించాలి
కేంద్ర ప్రభుత్వం వెంటనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలి. ఈ విషయంలో ప్రధాని మోదీ స్పందించాలి. కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలు అంటున్నదని ఎన్ని పథకాలు తీసుకొచ్చినా రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలువడం ఖాయం. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితారెడ్డి రాష్ర్టాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. లక్ష ఓట్ల మెజార్టీతో మంత్రి సబితారెడ్డి రానున్న ఎన్నికల్లో గెలుస్తుంది.
-రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ
ప్రతి పక్షాలకు బుద్ధి చెప్పాలి
రానున్న ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలు పగటి కలలు కం టున్నాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే వారి బతుకులు మారుతున్నాయి. ఇంటింటికీ అందుతున్న సంక్షే మ పథకాల ఫలాలతో ఆనందంగా జీవిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.
-ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్సీ
రాష్ర్టానికి బీజేపీ చేసిందేమీ లేదు
రాష్ర్టానికి బీజేపీ చేసిందేమీలేదు. సీఎం కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం. మంత్రి కేటీఆర్ చొరవతోనే జిల్లాకు దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు వస్తున్నాయి. జిల్లా అభ్యున్నతికి మం త్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. పని చేస్తున్న ప్రభుత్వా న్ని ఆశీర్వదించి.. రానున్న ఎన్నికల్లో భారీ మె జార్టీతో గెలిపించాలి. మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంత విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం ఉండదు. – మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
మంత్రి సుడిగాలి పర్యటన
రాష్ట్ర వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఆదివారం రంగారెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జల్పల్లి మున్సిపాలిటీలో రూ.10 లక్షల చొప్పున నిర్మించనున్న 12 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు శ్రీరామ్‌కాలనీలో శంకుస్థాపన చేశారు. కందుకూరులో రూ.176 కోట్లతో చేపట్టనున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు మంత్రి సబితారెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆమనగల్లుకు వెళ్లి ఆమనగల్లు మున్సిపాలిటీలో 50 పడకలతో నిర్మించనున్న దవాఖానకు శంకుస్థాపన చేయడంతోపాటు టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుంది..
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం. మెడికల్ కళాశాల శంకుస్థాపన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే రీతిలో బీఆర్ఎస్ పాలన సాగుతున్నది. ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ సీ ఎం కేసీఆర్ అండగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. విపక్షాల హామీలను ప్రజలు నమ్మొద్దు.
-సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ఆమనగల్లులో..
ఆమనగల్లు 1: ఆమనగల్లు పట్టణంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవా లు చేశారు. మొదట ఆమనగల్లు పట్టణంలో రూ.17.50 కోట్లతో నిర్మించనున్న 50 పడకల ప్రభుత్వ దవాఖానకు భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.1.25 కోట్లతో నిర్మించిన మాడల్ డిజిటల్ గ్రంథాలయాన్ని ప్రా రంభించారు. తదనంతరం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోనుగోటి అర్జున్రా వు రూ.36 లక్షల సొంత ఖర్చుతో తయా రు చేయించిన డాక్టర్ ఫార్మసీ వెల్నెస్ సం చార వైద్య వాహనాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అక్కడి నుంచి మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం టీయూఎఫ్ఐడీసీ ద్వారా విడుదలైన రూ.10 కోట్లకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ అయాచితం శ్రీధర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి మనోజ్‌కుమార్, జడ్పీటీసీ అనురాధ, విజితారెడ్డి, వెంకటేశ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నిర్మల, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా డైరెక్టర్ రాధ మ్మ, రై,స,స అధ్యక్షుడు నిట్టనారాయణ, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు అర్జున్‌రావు, పత్యానాయక్, సయ్యద్ఖలీ ల్, ఎంపీటీసీ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, అల్లాజీ, వెంకటేశ్ కిరణ్, ప్రసాద్, విక్రమ్, అల్లాజీ , భాస్కర్, నవీన్, పర్వతాలు, గణేశ్, పరీక్షిత్, వైద్యులు నాగరాజు, కమిషనర్ శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు.