Cyber crime | లింకులు క్లిక్ చేస్తే లాభమంటూ.. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు రూ. 50 లక్షలు టోకరా
యూ ట్యూబ్ లింకులు క్లిక్ చేసి డబ్బు సంపాదించవచ్చనే ఆశతో.. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పలు సార్లు పెట్టుబడి పెట్టి రూ. 36 లక్షలు పోగొట్టుకున్నాడు. పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో బాధితుడికి వాట్సాప్‌కు మెసేజ్ వచ్చిం ది.. ఆ మెసేజ్ క్లిక్ చేయగానే టెలిగ్రామ్‌లోకి వెళ్లింది. అక్కడ యూట్యూబ్‌కు సంబంధించిన లింక్‌లు క్లిక్ చేయాలి ..ఎన్ని క్లిక్‌లు చేస్తే అన్ని డబ్బులొస్తాయి. అయితే అందుకు కొంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందం టూ ఒక లింక్‌ను పంపించారు.
- పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో వాట్సాప్‌కు మెసేజ్
- దఫాలుగా పెట్టుబడి పెట్టిన బాధితులు
- తండ్రి మృతితో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులనూ వాడేసిన ఘనుడు
Cyber crime | యూ ట్యూబ్ లింకులు క్లిక్ చేసి డబ్బు సంపాదించవచ్చనే ఆశతో.. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పలు సార్లు పెట్టుబడి పెట్టి రూ. 36 లక్షలు పోగొట్టుకున్నాడు. పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో బాధితుడికి వాట్సాప్‌కు మెసేజ్ వచ్చిం ది.. ఆ మెసేజ్ క్లిక్ చేయగానే టెలిగ్రామ్‌లోకి వెళ్లింది. అక్కడ యూట్యూబ్‌కు సంబంధించిన లింక్‌లు క్లిక్ చేయాలి ..ఎన్ని క్లిక్‌లు చేస్తే అన్ని డబ్బులొస్తాయి. అయితే అందుకు కొంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందం టూ ఒక లింక్‌ను పంపించారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక యాప్ డౌన్లోడ్ అయ్యింది. ఆ యాప్ డౌన్లోడ్ కాగానే రూ. 500 పెట్టుబడి పెడితే కొన్ని యూట్యూబ్ లింక్‌లు క్లిక్ చేసే అవకాశం ఇచ్చారు. ఆ తరువాత రూ. 700 లాభం వచ్చిందంటూ స్క్రీన్‌పై చూపించింది, దానిని బాధితుడు డ్రా చేశాడు.
అనంతరం మరింత ఎక్కువ పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయంటూ నమ్మించారు. తక్కువ మొత్తం పెట్టినప్పుడు డబ్బు డ్రా చేసుకునే అవకాశమిచ్చారు. ఆ తరువాత పెట్టుబడి లక్ష ల్లో పెట్టడంతో స్క్రీన్‌పై లాభాలు కనిపించాయి, వాటిని డ్రా చేసుకునే వీలులేకుండా పోయింది. వాటిని డ్రా చేసుకోవాలంటే మరిన్ని టాస్క్‌లు పూర్తి చేయాలంటూ సైబర్ నేరగాళ్లు మరింత డబ్బు పెట్టించారు. ఇలా పలు సార్లు రూ. 36 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే సగంలో ఆపేస్తే అప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందని, సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు టాస్క్‌లు పెంచుకుంటూ పోయానని, ఇం దులో తన తండ్రి చనిపోయిన తరువాత వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు, అమ్మ సేవింగ్స్‌ను కూడా పెట్టుబడి పెట్టానంటూ బాధితుడు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసుల ముం దు తన ఆవేదన వెలిబుచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో వనస్థలిపురం వాసి..
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వనస్థలిపురం వాసికి పార్ట్‌టైమ్ పేరుతో వాట్సాప్‌కు ఒక మేసేజ్ వచ్చింది. యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే చాలు మీకు డబ్బులు వస్తాయంటూ ఆ మేసేజ్‌లో పేర్కొన్నారు. అనంతరం టెలిగ్రామ్ యాప్‌లోకి తీసుకెళ్లి రూ. 500 పెట్టుబడి పెట్టించారు. అందులో రూ.150 లాభం వచ్చింది. తిరిగి రూ. వెయ్యి పెట్టుబడి పెట్టించడంతో రూ. 300 లాభం వచ్చింది. నమ్మకం కుదరడంతో రూ. 25 వేలు పెట్టుబడి పెట్టగా.. ఇక్కడ కూడా రూ. 15 వేలు లాభం చూపించారు. దీంతో పూర్తి నమ్మకం కుదిరిన బాధితుడు పలు సార్లు రూ. 13.07 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. ఈ మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

