షాబాద్, ఆగస్టు 12: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులను దాతలు ప్రోత్సహించాలని షాబాద్ మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్ అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని అప్పారెడ్డిగూడ పాఠశాలలో జాతీయ మానవహక్కులు, నేర నియంత్రణ సంస్థ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, వాటర్‌బాటిల్స్, పలకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ..పేద విద్యార్థులను దాతలు ప్రోత్సహిస్తే వారు మరింతా ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పారు.
విద్యార్థులు కష్టపడి చదువుకుని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఫ్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేపడుతు న్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజునాయక్, లోక్యనాయక్, సందీప్‌గౌడ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.