షాబాద్, ఆగస్టు 1: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని షాబాద్ మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్‌నాయక్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగరగూడ ప్రాథమిక పాఠశాలలో అదే గ్రామానికి చెందిన దాత నరేందర్ విద్యార్థులకు ఉచితంగా టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, నోట్‌బుక్కులు అందజేశారు. అదే విధంగా మరో దాత విఠల్‌గౌడ్ విద్యార్థుల కోసం వాటర్ ప్యూరిఫైయర్ అందించారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్‌నాయక్ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల ప్రోత్సహం ఎంతో అవసరమని తెలిపారు. భవిష్యత్తు తరాలకు ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అవసరమని, ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఏం విష్ణువర్దన్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరప్పోళ్ల కృష్ణ, ఉపాధ్యాయురాలు కవిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు వెంకటేశ్, ముక్తార్, సలీం, విద్యార్థులు తదితరులున్నారు.