షాద్‌నగర్, ఏప్రిల్ 25 : దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉన్నదా ? అని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ప్రశ్నించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శనీయమన్నారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండలం హాజిపల్లి గ్రామంలో ఏవీ కన్వెన్షన్ హాల్లో షాద్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సకల జనుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ‘మిషన్ కాకతీయ’ చెరువులు బాగుపడగా, భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ‘మిషన్ భగీరథ’తో తాగునీటి సమస్య తీరిందన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయన్నారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, రాష్ట్ర సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ రాజావరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బీష్వ కిష్టయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు ఉన్నాయా ? అని ప్రశ్నించారు. పదే పదే రాష్ట్ర పర్యటనలు చేసే బీజేపీ పెద్దలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. సమావేశానికి ముందు ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ పార్టీ జెండాను ఎగురవేశారు. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి నివాళులర్పించారు. పలువురు మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.
గిరిజన కళాకారులు పాటలను పాడి అలరింపజేశారు. సమావేశంలో వ్యవసాయం, వైద్యం. పరిశ్రమలు ఉపాధి, మౌళిక వసతులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమమం, విద్య, రవాణా వంటి 20 అంశాలపై తీర్మానం చేశారు. ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమణారెడ్డితో పాటు అతడి అనుచరులు సుమారు 20 మంది, చటాన్‌పల్లికి చెందిన మాల మహేశ్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ కె.నరేందర్, ఎంపీపీలు ఖాజా ఇద్రీస్, వై.రవీందర్‌యాదవ్, జడ్పీటీసీలు పి. వెంకట్రాంరెడ్డి, తాండ్ర విశాల, బంగారు స్వరూప, శ్రీలత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అగ్గనూరు విశ్వం, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, నాయకులు లక్ష్మణ్‌నాయక్, రాంబాల్‌నాయక్, బెంది శ్రీనివాస్‌రెడ్డి, వన్నాడ ప్రకాష్‌గౌడ్, ఆకుల శ్రీశైలంతదితరులు పాల్గొన్నారు.