దుండిగల్, మే 4: నిధులు ఎన్నైనా కేటాయించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. గాజుల రామారం డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీ ఫేజ్ -1 లో రూ .40 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును, ఉషోదయ కాలనీ ఫేస్ -2 లో రూ.80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన విఘ్నేశ్వర పార్క్ ను ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల, ఎమ్మెల్యే కేపీ వివేకా మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కుత్బుల్లాపూర్ ను అభివృద్ధి పరుస్తున్నామని, అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నా మన్నారు. ఇక మహదేవపరంలో రూ.90లక్షల వ్యయంతో నిర్మించిన పార్కును కేపీ వివేకానందతో కలిసి ఈటల ప్రారంభించారు. పిల్లలకు ఆటవిడుపు, పెద్దలకు మానసిక ప్రశాంతత చేకూర్చడంలో పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పార్కులను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత అందరిపై ఉందని సందర్భంగా వారు పేర్కొన్నారు.