మన్సురాబాద్, మే 25: ఎల్బీనగర్ కు చెందిన సామాజిక కార్యకర్త, డాక్టర్ వీరభోగ వసంతరాయలు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్బీనగర్లో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ వసంతరాయలుకు నియామక పత్రాన్ని అందజేశారు. ప్రముఖ వైద్యులు, సామాజిక కార్యకర్త, డాక్టర్ వీరభోగ వసంతరాయలు బీసీల హక్కుల సాధన కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఈ సందర్భంగా డాక్టర్ వసంత రాయులు మాట్లాడుతూ.. బీసీ కులాలను ఐక్యం చేసి వారి హక్కుల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి భాస్కరుడు, కోశాధికారి పసుపులేటి కర్ణాకర్, ఉపాధ్యక్షులు రాణా నాగేష్ సింగ్, సికింద్రాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ గోగుల స్వామి, ఎల్బీనగర్ నియోజకవర్గం సభ్యులు దీకొండ గోపాల్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.